Akkineni Akhil marriage date: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో అఖిల్ అక్కినేని ఒకరు. సిసింద్రీ సినిమాతో బాల నటుడుగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ చాలా చిన్న ఏజ్ లోనే మంచి గుర్తింపును సాధించుకున్నాడు. ఆ తర్వాత మనం సినిమాలో కనిపించి ఆడియన్స్ కి మంచి సప్రైజ్ ఇచ్చాడు. అయితే అఖిల్ సినిమాల్లో కనిపించడానికి అంటే ముందు సెలబ్రెటీ క్రికెట్ లీగ్ లో ఇన్వాల్వ్ అవుతూ తన టాలెంట్ చూపించాడు. ఒక స్టేజ్ లో అఖిల్ మంచి క్రికెటర్ అయిపోతాడు అని చాలామంది ఊహించారు. కానీ వారసత్వంగా వస్తున్న సినిమా రంగంలోనే అఖిల్ తనను తాను ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నాడు. వివి వినాయక్ దర్శకత్వం వహించిన అఖిల్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలైంది. కానీ ఊహించని డిజాస్టర్ ను మూటగట్టుకుంది.
అఖిల్ వైఫ్ ఏజ్ లో పెద్ద.?
ఇక అఖిల్ జైనబ్ రావ్ జీ అని దుబాయ్ కి సంబంధించిన మోడల్ తో ఎంగేజ్మెంట్ జరిగినట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు నాగచైతన్య అక్కినేని కూడా శోభితాను పెళ్లి చేసుకున్నారు . ఇక అఖిల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి అప్పట్లో చాలామంది ఆరాలు తీయడం మొదలుపెట్టారు. వీటిలో ఆసక్తికరమైన వార్త ఒకటి వినిపిస్తుంది. అఖిల్ కంటే జైనబ్ దాదాపు తొమ్మిదేళ్లు పెద్ద అని కథనాలు కూడా వచ్చాయి. అయితే దీనిపై కొంతమంది కొన్ని రకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది మాత్రం సచిన్ రికార్డును బ్రేక్ చేశారు అంటూ కామెంట్స్ కూడా వినిపించాయి.
పెళ్లి డేట్ ఫిక్స్
జూన్ 6న అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది. అయితే దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రీసెంట్ లో సెలబ్రిటీస్ అన్ని విషయాలు కూడా చాలా లేటుగా రివీల్ చేయడం మొదలుపెట్టారు. ముందు నుంచే రివిల్ చేయడం మొదలుపెడితే ఎక్కువగా మీడియాలో నిలవాల్సి వస్తుంది అని బహుశా గ్రహించి ఉంటారు. అఖిల్ ప్రస్తుతం మరోవైపు సినిమాల్లో కూడా కంప్లీట్ బిజీగా మారిపోయాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హిట్టుతో సక్సెస్ అందుకున్న అఖిల్ ఏజెంట్ సినిమాతో భారీ డిజాస్టర్ చూశాడు. ఇప్పుడు లెనిన్ సినిమాతో మంచి కం బ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈయన వినరో భాగ్యమే విష్ణు కథ అనే సినిమా చేశారు.
Also Read: RGV On Triptii Dimri: యానిమల్ లో చూపించిన్నట్టు చూపించు… త్రిప్తి దిమ్రిపై ఆర్జీవీ మరో పోస్ట్