Ustaad Bhagat Singh: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ఎన్నికల ముందు మూడు సినిమాలకు సైన్ చేసిన విషయం తెలిసిందే. ఓజి, హరిహర వీరమల్లు, అలాగే ఉస్తాద్
భగత్ సింగ్.. ఓజి సినిమా అలాగే వీరమల్లు సినిమాలు దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉంది. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ ( Harish Sankar ) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హరీష్ శంకర్, పవర్ స్టార్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.. ఈ సినిమాను ఎప్పుడు థియేటర్లలో చూస్తామని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. సినిమా షూటింగ్ మొదలైనప్పుడు రిలీజ్ అయిన గ్లిమ్స్ వీడియో ఫాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఖచ్చితంగా హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’కు మించి ఎంటర్టైన్ చేస్తాడనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు..
ఈ సినిమా కోసం వెయ్యికలతో ఎదురుచూస్తున్న అభిమానులను డైరెక్టర్ హరీష్ శంకర్ నిరాశపరిచారు. తాజాగా ఓ సినిమా ఈవెంట్లో పాల్గొన్న ఆయన ఈ సినిమాలోని కీలకమైన సీన్ ని లీక్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హరిశంకర్ పై కోపంగా ఉన్నారు. హరీశ్ శంకర్ లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా ఫిబ్రవరి 21న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు గెస్టుగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ప్రస్థావించారు. అంతేకాదు ఆ మూవీలో ని సీన్ ను లీక్ చేశారు. పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేస్తే ఆయన కారు టాప్ మీద కూర్చున్న సీన్ తీస్తా. ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆ సీన్ షూట్ చేశాం.. అని తెలిపారు. ఇంతే కాకుండా.. గత కొద్ది రోజులుగా ఉస్తాద్ సినిమా ఆగిందంటూ ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలో ఎటువంటి నిజం లేదని హరీష్ కొట్టి పడేశారు..
Also Read : లక్ అంటే ఇదే.. ఒకేసారి ముగ్గురు స్టార్ డైరెక్టర్స్‌తో..
ఈ సినిమా షూటింగ్ కొంతవరకు పూర్తి చేశాం.. మరి సినిమాని ఎందుకు క్యాన్సల్ చేస్తామని డైరెక్టర్ హరి శంకర్ క్లారిటీ ఇచ్చారు.. మొత్తానికి ఈ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవడంతో హరీష్ శంకర్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు సినిమా ఉంటుందో లేదో అని టెన్షన్ పడుతున్నారు అయితే ఇప్పుడు ఏకంగా సీను లీక్ చేశారు అని ఆయనపై సోషల్ మీడియా ద్వారా కామెంట్లు చేస్తున్నారు. గతంలో ఎన్నికల ప్రచారం సమయంలో ఓసారి పవన్ కళ్యాణ్ కారు టాప్ పై నిల్చోని ప్రచారం చేశారు. అది చాలా ప్రమాదకరమని ఆయనపై పలు కేసులు కూడా నమోదయ్యాయి ఇప్పుడు అలాంటి సీన్ ను సినిమాలో పెడుతుండటంతో ఫ్యాన్స్‌కు మరోసారి గూస్ బంప్స్ వస్తాయని అభిప్రాయపడుతున్నారు. ఇక క్లైమాక్స్ సీన్ లో కూడా ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు ఆ మధ్య హరీష్ శంకర్ చెప్పారు.. తనకైతే ఈ సినిమా ఉందని కన్ఫామ్ చేసుకున్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు..