Manchu Manoj: సమస్యలు అనేవి ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. కానీ సెలబ్రిటీ హోదాలో ఉన్న వారి ఇంట్లో కొన్ని సమస్యలు తలెత్తినప్పుడు వాటిని సామరహస్యంగా సర్దుబాటు చేసుకోవాలి. సామాన్యుల అరుచుకుంటూనే అవి బయటపడతాయి. అచ్చం అలానే జరిగింది మంచి ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సమస్య. ఉన్నఫలంగా ఒకరోజు మంచు విష్ణు మంచు మనోజ్ ఇంటికి వచ్చి దాడి చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో వైరల్ కాగానే ప్రముఖ తెలుగు మీడియా ఛానల్స్ అన్నీ కూడా దాని గురించి చర్చ మొదలుపెట్టాయి. అయితే వీటన్నిటిని కామప్ చేయడానికి, ఇది ఒక రియాల్టీ షో అంటూ మంచి విష్ణు ఒక వీడియో చేశాడు. దానికి సంబంధించిన ఒక ప్రోమో కూడా విడుదల చేశారు. అయితే ఆ పూర్తి షో ఇప్పటివరకు రాలేదు.
గొడవలు బహిరంగం
మంచి ఫ్యామిలీ వివాదాలు కొన్ని రోజుల తర్వాత పూర్తిస్థాయిలో బయటపడ్డాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి వెళ్ళిపోయాయి. దీని గురించి బహిరంగంగానే ఒకరినొకరు తిట్టుకోవడం మొదలుపెట్టారు. మోహన్ బాబు అయితే ఏకంగా ఆడియోస్ ను బయటకు విడుదల చేశారు. అయితే ఈ గొడవలు తారాస్థాయికి వెళ్లిపోయాయి. ఈ గొడవలకు సంబంధించి ఇరువురు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ కూడా పెట్టుకున్నారు. అయితే ఈ గొడవ మొత్తంలో ఎక్కడ మంచు లక్ష్మీ ప్రసన్న కనిపించలేదు. అసలు మంచు మనోజ్ , విష్ణు లలో తను ఎవరి సపోర్ట్ చేస్తుందో అసలు అర్థం కాలేదు. అయితే ఇప్పటికి ఈ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దీనిపైన మంచు లక్ష్మి బయట ఎక్కడ కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు.
మంచు లక్ష్మి స్పందించకపోవడానికి కారణం
కొన్ని రోజుల కింద ఒక ఈవెంట్లో మంచు లక్ష్మి ను వెనకనుంచి తాకుతాడు మనోజ్. మంచు లక్ష్మి మనోజ్ ను చూసిన వెంటనే ఎమోషనల్ కి గురి అవుతుంది. అయితే వీరిద్దరూ కూడా ఎమోషనల్ అయిన వీడియో సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ గా మారింది. ఇక రీసెంట్గా ఈ వీడియో గురించి మాట్లాడుతూ మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చాడు. ఈ గొడవ మొత్తంలో ఎందుకు మంచు లక్ష్మీ మాట్లాడలేదు అనేదానికి సమాధానం కూడా తెలిపాడు. వాస్తవానికి మంచు లక్ష్మి పూర్తి సపోర్ట్ మంచి మనోజ్ కి ఉంది. అయితే అప్పటికే ఈ వివాదంలో మంచు మనోజ్ భార్యను లాగడంతో చాలా బాధపడ్డాడు. మళ్లీ మంచు లక్ష్మి ఈ విషయంపై స్పందిస్తే తనను కూడా వివాదంలోకి లాగుతారని తెలిసి, తనను ఏ మాట మాట్లాడకుండా ఉండమని మంచు మనోజ్ మంచు లక్ష్మికి చెప్పారట. అందుకే ఇప్పటివరకు కూడా మంచు లక్ష్మి ఈ వివాదం పైన ఒక మాట కూడా మాట్లాడలేదు.
Also Read : Allari Naresh : అల్లరి నరేష్ సినిమా కోసం డిఫరెంట్ టైటిల్