BigTV English

Kajal Aggarwal: హీరోయిన్‌కు చేదు అనుభవం.. అతడు నేరుగా వ్యాన్‌లోకి వచ్చి..

Kajal Aggarwal: హీరోయిన్‌కు చేదు అనుభవం.. అతడు నేరుగా వ్యాన్‌లోకి వచ్చి..

Craziest fan experience: పలువురు సినీ తారలు అప్పుడప్పుడు షూటింగ్ ల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు కానీ, ఇతర ఏదైనా కార్యక్రమాలకు వెళ్లినప్పుడు వారికి ఎదురైన చేదు అనుభవాల గురించి తెలిసిందే. సినిమా హీరోయిన్లు కళ్ల ముందు కనపడగానే కొంతమంది అభిమానులు తమ అభిమానాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కొంతమంది హద్దులు దాటి మరీ ప్రయత్నిస్తుంటారు.


ఈ క్రమంలో సినీ తారలు కొంత ఇబ్బందికి గురయ్యే పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇలాంటి చేదు అనుభవమే ప్రముఖ సినిమా హీరోయిన్ కాజల్ కు కూడా ఎదురైంది. ఆ సమయంలో ఆమె ఒక్కసారిగా షాక్ కు గురైంది.. ఆ వెంటనే ఆశ్చర్యపోయి.. ఓరి నీ అభిమానం తగలెయ్యా.. ఇంతగనమా.. నువ్వు మరీనూ.. అంటూ ఆశ్చర్యానికి గురైంది. కొన్నాళ్ల క్రితం ఓ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనను కాజల్ ఇప్పుడు తాజాగా మరోసారి గుర్తుచేసుకుంది.

‘కొన్ని రోజులు క్రితం జరిగిన ఓ సినిమా షూటింగ్ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. అయితే ఆ షూటింగ్ తొలి రోజే నాకు చేదు అనుభవం ఎదురైంది. ఆరోజు షూటింగ్ పూర్తయ్యాక వ్యానిటీ వ్యాన్ లోకి నేను వెళ్లాను. అయితే, ఇదే క్రమంలో ఆ మూవీ అసిస్టెంట్ డైరెక్టర్ అనుమతి లేకుండా నా వ్యానిటీ వ్యాన్ లోకి వచ్చాడు. అనంతరం అతను చొక్కా విప్పి తన ఛాతీపే ఉన్నటువంటి నా పేరుతో కూడిన టాటూను చూపించాడు. ఆ సమయంలో ఎవరూ లేరు.. అతను అలా చేసే సరికి ఒక్కసారి నేను భయపడిపోయాను. అయితే, అతను నాపై ఉన్న అభిమానాన్ని పచ్చబొట్టు రూపంలో అలా ప్రదర్శించినందుకు సంతోషమే కానీ, అలా చేయడమే సరికాదు అంటూ సున్నితంగా హెచ్చరించా’ అంటూ కాజల్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె గుర్తుచేసుకుంది. అయితే, కాజల్ పలు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.


Also Read: చిన్న ధాబాలో భార్యతో కలిసి బన్నీ ఏం చేస్తున్నాడో చూడండి.. ?

సుమన్ చిక్కాల దర్శకత్వంలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న సత్యభామ సినిమా ఈనెల 31న ప్రేక్షకుల ముందుకురానున్నది. ఈ సినిమాను క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించిన విషయం తెలిసిందే.

Tags

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×