Payal Rajput: సామాన్య ప్రజలతో పోల్చుకుంటే సినీ సెలబ్రిటీలు ఎంత బిజీగా ఉంటారు అంటే.. వారు తమ ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా.. ప్రజలకు వినోదాన్ని పంచడానికి రాత్రింబవళ్లు షూటింగ్లో పాల్గొంటూ తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. అందుకే సినిమా సెలబ్రిటీలకు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే అలా టాలీవుడ్ కి చెందిన ఒక క్రేజీ హీరోయిన్ కూడా తనకు అలాంటి ఆరోగ్య సమస్య ఉంది అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా పంచుకుంది.
అలాంటి సమస్యతో బాధపడుతున్న పాయల్ రాజ్ పుత్..
ఆమె ఎవరో పాయల్ రాజ్ పుత్.. తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా.. “నాకు కంటి సమస్య వచ్చింది. దీని పేరుని కూడా నేను సరిగ్గా పలకలేకపోతున్నాను. నా కంటికి ఏది కూడా సరిగ్గా కనిపించడం లేదు. అన్నీ కూడా రెండుగా కనిపిస్తున్నాయి. పైగా చాలా బ్లర్డ్ గా కనిపిస్తున్నాయి. నా పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఆల్రెడీ నేను ఇచ్చిన కమిట్మెంట్ కారణంగా ప్రోగ్రామ్స్ కి, ఈవెంట్లకు వెళ్లాల్సిందే కదా.. ఇక అక్కడ ఎలా మేనేజ్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. అసలు ఈ సమస్య ఎలా తీరుతుందో.. అంతా దేవుడి దయ. అయినా ఇప్పుడు ఈ కళ్లద్దాలు పెట్టి మేనేజ్ చేస్తాను.. కనిపించకపోతేనేం.. నటించగలను కదా.. అంటూ ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఒక వీడియోని పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్స్, ఫాలోవర్స్ పాయల్ కు ఏమైంది అంటూ ప్రశ్నిస్తున్నారు.
ALSO READ: Actress Ivana: 12 ఏళ్లకే అన్నీ చూసా… ఇప్పుడు అలాంటివి ఏమీ చేయలేను..!
పాయల్ రాజ్ పుత్ కెరియర్..
పాయల్ రాజ్ పుత్ కెరియర్ విషయానికి వస్తే.. అజయ్ భూపతి (Ajay bhupathi) దర్శకత్వంలో ‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి సినిమాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. అయితే ఈ రెండు చిత్రాలకి మధ్యలో కథానాయకుడు, ఆర్డిఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజా, తీస్మార్ ఖాన్, అనగనగా ఓ అతిథి, మాయాపేటిక తదితర సినిమాలలో నటించి ఆకట్టుకుంది.ఇక ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. కానీ మంగళవారం మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా పాయల్ కెరియర్ కు మంచి బూస్ట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈయన చేతిలో ‘వెంకటలచ్చిమి’ అనే డిఫరెంట్ మూవీ ఉంది. దీంతో పాటు మరికొన్ని సినిమాలను ఒకే చేసే పనిలో పడింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇలాంటి సమయంలో తనకు కంటి సమస్యలు వచ్చాయని చెప్పి అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఇక త్వరగా కంటికి సంబంధించిన చికిత్స తీసుకొని మళ్లీ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే పాయల్ రాజ్ పుత్ ఈ మధ్యకాలంలో తన పర్సనల్ విషయాలను కూడా పంచుకుంటుంది. అందులో భాగంగానే తనకు వచ్చిన సమస్య గురించి అభిమానులతో చెప్పుకుంది ఈ ముద్దుగుమ్మ.