Actress Ivana.. ఇవానా (Ivana).. ప్రస్తుతం కుర్రకారు క్రష్ గా మారిపోయిన ఈ ముద్దగుమ్మ.. ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా వచ్చిన ‘లవ్ టుడే’ సినిమాతో తెలుగు వాళ్లకు దగ్గరయ్యింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈమె.. ఇప్పుడు శ్రీ విష్ణు (Sri Vishnu) తో కలిసి ‘సింగిల్’ మూవీలో నటించి, తన నటనతో మెస్మరైజ్ చేసింది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ ఆడియన్స్ కి ఫేవరెట్ గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని, ఆసక్తికర విషయాలు పంచుకుంది. 12 ఏళ్లకే అన్నీ చూసాను. ఇకపై ఇప్పుడు అలాంటివి ఏమీ చేయలేను అంటూ కూడా తెలిపింది. మరి ఇవానా దేని గురించి ఈ కామెంట్లు చేసింది అనే విషయం ఇప్పుడు చూద్దాం.
12 ఏళ్లకే అన్నీ చూసా..
ఇవానా మాట్లాడుతూ.. “12 సంవత్సరాలకే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చాను. అప్పుడు అవమానాలు ఎదుర్కొన్నాను. ఎత్తు తక్కువ అని విమర్శించారు. కానీ ఆత్మస్థైర్యంతో ఇక్కడి వరకు రాగలిగాను. రొమాంటిక్ సీన్స్, గ్లామర్ రోల్స్ నాకు నచ్చవు. ఎమోషనల్ సీన్స్ మాత్రం బాగా చేస్తాను. యాక్షన్ చిత్రాలలో చేయాలని ఉంది” అంటూ తన మనసులో మాటను కూడా చెప్పుకొచ్చింది ఇవానా. ప్రస్తుతం ఇవానా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈమె మాటలు విన్న అభిమానులు పొట్టిగా ఉంటేనేమి నటనలో రాణించాలి కానీ.. ఇప్పటికే నిత్యామీనన్ (Nithya Menon) కూడా పొట్టిగానే ఉంటారు. కానీ ఆమె తన నటనతో నేషనల్ అవార్డు అందుకున్నారు. మీరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీ టాలెంట్ ను నమ్ముకుంటే ఆఫర్లు మీ వద్దకు వచ్చి పడతాయి అంటూ ఆమెకు సపోర్టుగా నిలుస్తున్నారు.
ALSO READ : Pawan Kalyan: పవన్ కళ్యాణ్ లాస్ట్ మూవీ అదేనా.. ఫ్యాన్స్ లో మొదలైన టెన్షన్..!
ఇవానా కెరియర్..
ఇవానా విషయానికి వస్తే.. 2000 సంవత్సరం ఫిబ్రవరి 25న కేరళలో అలీనా షాజీ గా జన్మించింది. 2012లో వచ్చిన మలయాళ చిత్రం ‘మాస్టర్స్’ లో బాలనటిగా నటించి, తన వృత్తిని ప్రారంభించిన ఈమె.. 2016 లో వచ్చిన ‘అనురాగ కరికిన్ వెల్లం’ అనే సినిమాలో హీరో కూతురి పాత్రలో నటించినది.. ప్రముఖ డైరెక్టర్ బాల తన తమిళ చిత్రమైన నాచియార్ లో జ్యోతిక, జీవి ప్రకాష్ కుమార్లతో కలిసి కీలకపాత్రలో నటించేందుకు అవకాశం రాగా.. ఈ చిత్రాన్ని తెలుగులో ఝాన్సీగా డబ్ చేసి విడుదల చేశారు. ఇకపోతే ఈమె పేరు తమిళ ప్రేక్షకులు ఉచ్చరించడానికి వీలుగా ఇవానా అని మార్చుకుంది. ఇక లవ్ టుడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈమె.. ఎల్ జి ఎం అనే సినిమాలో నటిస్తోంది. ఈమె తెలుగు మొదటి చిత్రం సెల్ఫిష్ కావడం గమనార్హం. ఇప్పుడు శ్రీ విష్ణు తో కలిసి సింగిల్ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకుంది.. ఇకపోతే 2019లో నాచియార్ చిత్రానికి ఉత్తమ అరంగేట్రం విభాగంలో సైమా అవార్డుకి ఎంపిక కాగా.. ఉత్తమ సహాయ నటి విభాగంలో ఫిలింఫేర్ అవార్డుకి ఎంపికయింది. ఇక ప్రస్తుతం ఈమె చేతిలో మరికొన్ని ప్రాజెక్టులు ఉన్నట్లు సమాచారం.