BigTV English

Rakshana Trailer: ఇదేం ట్రైలర్‌ రా బాబు.. థ్రిల్లింగ్, సస్పెన్షన్‌తో గూస్ బంప్స్ తెప్పించింది.. పాయల్‌కు ఈ సారి మరో హిట్టు పక్కా..

Rakshana Trailer: ఇదేం ట్రైలర్‌ రా బాబు.. థ్రిల్లింగ్, సస్పెన్షన్‌తో గూస్ బంప్స్ తెప్పించింది.. పాయల్‌కు ఈ సారి మరో హిట్టు పక్కా..

Payal Rajput Rakshana Movie Trailer: ‘ఆర్ ఎక్స్ 100’తో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది రొమాంటికి బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఆ తర్వాత పలు సినిమాలు చేసినా ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించలేదు. అయితే గతేడాది మాత్రం ‘మంగళవారం’ సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తన మొదటి సినిమా ‘ఆర్ ఎక్స్ 100’తో మంచి విజయం అందించిన దర్శకుడు అజయ్ భూపతే ‘మంగళవారం’ మూవీకి కూడా దర్శకత్వం వహించి మరో ఘన విజయాన్ని ఆమెకు అందించాడు.


అయితే ఈ రెండు సినిమాల్లో కూడా రొమాన్స్ సీన్లు ఓ రేంజ్‌లో ఉంటూ సినీ ప్రియుల్ని, అభిమానుల్ని ఉర్రూతలూగించాయి. ఈ రెండు సినిమాలే కాదు.. RDX LOVE అనే సినిమాలో కూడా పాయల్ రొమాన్స్‌కు ఆడియన్స్ ఫిదా అయిపోయారనే చెప్పాలి. ఇక ఇప్పటి వరకు ఆమె చేసిన సినిమాలన్నింటిలో కూడా రొమాన్స్ కామన్ అయిపోయింది. కానీ ఇప్పుడు పాయల్ తన సినీ కెరీర్‌లో సరికొత్త పాత్రలో నటించేందుకు సిద్ధమైంది.

ఇందులో భాగంగానే ఇప్పుడు ‘రక్షణ’ అనే మూవీ చేస్తోంది. లేడీ ఓరియెంటెడ్‌గా రాబోతున్న ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుంది. అలాగే ఇందులో రాజీవ్ కనకాల, మానస్, రోషన్ వంటి నటులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.


Also Read: పాయల్ పాప కొత్త సినిమా టైటిల్ ఖరారు.. ఈ సారి నో రొమాన్స్.. ఓన్లీ యాక్షన్

అయితే ఇప్పుడు మేకర్స్ అదిరిపోయే సర్‌ప్రైజ్ అందించారు. ఇందులో భాగంగా ఈ మూవీ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చాలా థ్రిల్లింగ్‌గా, సర్‌ప్రైజ్‌గా ఉంది. అంతేకాకుండా పాయల్ రాజ్‌పుత్ తన యాక్టింగ్‌తో అదరగొట్టేసింది. ఒక మహిళ హత్యకు గురైతే దాన్ని పోలీసులు పట్టించుకోకుండా ఆత్మహత్య కింద చూసి కేసు క్లోజ్ చేయాలని చూస్తారు. కానీ అది ఆత్మహత్య కాదని.. అది హత్య అని కిరణ్ కుమార్ పూడి (పాయల్) చెప్పినా పోలీసులు వినిపించుకోరు.

ఇక రోజంతా పాయల్‌కు అవే కళలు వస్తుంటాయి. తనను ఎవరో చంపుతున్నట్లు, వెంబడిస్తున్నట్లు చాలా భయపడుతుంటుంది. అయితే ఇలాంటి సంఘటనలు ఇకపై జరగకుండా ఉండాలని.. అలాగే ఈ కేసుపై ఫుల్ ఫొకస్ పెట్టేందుకు కిరణ్ కుమార్ పూడి (పాయల్) పోలీస్ ఆఫీసర్‌గా మారుతుంది. అక్కడ నుంచి తానే ఇన్విస్టిగేషన్ మొదలు పెడుతుంది. ఆ సమయంలో ఆమె ఎన్నో ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటుంది. ఇలా మొత్తంగా ట్రైలర్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగింది. దీని బట్టి చూస్తే సినిమా ఓ రేంజ్‌లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో అదిరిపోనుందని తెలుస్తోంది. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా జూన్ 7న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×