BigTV English
Advertisement

YS Jagan Stone Attack Case: రివాల్వర్‌తో బెదిరించారు: గులకరాయి కేసు నిందితుడు సతీష్

YS Jagan Stone Attack Case: రివాల్వర్‌తో బెదిరించారు: గులకరాయి కేసు నిందితుడు సతీష్

YS Jagan Stone Attack Case: ఏపీ సీఎం జగన్‌పై దాడి కేసులో నిందితుడు సతీష్ నెల్లూరులోని సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యాడు. ఈ సందర్భంగా మీడియా ముందు సతీష్ కంటతడి పెట్టుకున్నాడు. జగన్ పై దాడి కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. కేసు ఒప్పుకోవాలని పోలీసులే తనను రివాల్వర్ తో బెదిరించారిని వాపోయాడు.


సీఎం జగన్ పై దాడి కేసులో నిందితుడు వేముల సతీష్ జైలు నుంచి విడుదల అయ్యాడు. నెల్లూరు జైలులో రిమాండ్ గా ఉన్న అతడికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. దీంతో జైలు నుంచి సతీష్ ను విడుదల చేశారు. రెండు రోజుల క్రితమే అతడు విడుదల కావాల్సి ఉన్నా.. కొన్ని కారణాల వల్ల ఆదివారం బయటకు వచ్చాడు. సతీష్ తండ్రి దుర్గారావు, తల్లి రమణ, లాయర్ అబ్దుల్ నెల్లూరుకు వచ్చి అతడిని విజయవాడకు తీసుకువెళ్లారు.

Also Read: పల్నాడు రౌడీలకు లేడీ సింగం మాస్ వార్నింగ్..


ఏప్రిల్ 13న సీఎం జగన్ పై గులకరాయి దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడి కేసు దర్యాప్తు చేసిన పోలీసులు సతీష్ ఈ దాడి చేసినట్లు ఆరోపిస్తూ అదుపులోకి తీసుకున్నారు. బెయిల్ పై బయటకు వచ్చిన సతీష్ ఈ కేసుతో తనుకు ఎలాంటి సంబంధం లేదని కన్నీరు పెట్టుకున్నాడు. పోలీసులే తనను కేసు ఒప్పుకోవాలని రివాల్వర్ తో భయపెట్టారని సతీష్ ఆరోపించాడు. చీకటి ప్రాంతాల్లో తిప్పుతూ తనకు రెండు లక్షలు ఇస్తామనని గన్ పెట్టి బెదిరించినా.. తాను ఒప్పుకోలేదని తెలిపాడు. సతీష్.. సీఎంపై దాడి చేసినట్లు పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవని డిఫెన్స్ లాయర్ అబ్దుల్ వెల్లడించారు.

Tags

Related News

CM Chandra Babu: ఇదే లాస్ట్ వార్నింగ్.. ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. మహిళకు గాయాలు

Vidadala Rajini: రజిని కొత్త రచ్చ.. పోలీసులపై ఫైర్

Janasena X Account: జనసేన అధికారిక ‘ఎక్స్’ ఖాతా హ్యాక్.. వరుసగా అనుమానాస్పద పోస్టులు

Pawan Kalyan: కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Nara Lokesh: బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరపున మంత్రి నారా లోకేష్ ప్రచారం..

Kotamreddy Sridhar Reddy: మాకేమైనా బిచ్చమేస్తున్నారా? అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Ambati Logic: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఉంటేనే మాకు లాభం.. అంబటి వింత లాజిక్

Big Stories

×