Payal Rajput:ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అంటే గ్లామర్ గా కనిపించాలని కొంతమంది చెబితే.. మరి కొంత మంది టాలెంట్ ఉండి.. నటన కనబరిచి, మన టాలెంట్ కు తగ్గట్టుగా పాత్ర పడితే కచ్చితంగా స్టార్ అయిపోవచ్చు అని చెబుతూ ఉంటారు. వాస్తవానికి ఏం చేసినా ఇండస్ట్రీలో ఉన్నత స్థాయికి ఎదుగడానికే ఇన్ని కష్టాలు..అందులో భాగంగానే ఎంతోమంది హీరోయిన్స్ ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి దర్శకుల కంట్లో పడాలని చూస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం ఏకంగా అందాల జాతర చేస్తూ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఆమె ఎవరో కాదు పాయల్ రాజ్ పుత్ (Payal Rajputh). ప్రముఖ హీరోయిన్ పాయల్ రాజపుత్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా అజయ్ భూపతి (Ajay Bhupathi)దర్శకత్వం వహించిన ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె.. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో విలన్ గా కనిపించి అందరిని మెస్మరైజ్ చేసింది. అలాగే తన నటనతో యువతను ఫిదా చేసేసింది. మొదటి సినిమా అయినా హద్దులు చెరిపేసి మరీ నటించడంతో అమ్మడి టాలెంట్ కి అందరూ ఫిదా అయిపోయారు. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి అందులో భాగంగానే ‘వెంకీ మామ’, ‘తీస్మార్ ఖాన్’, ‘డిస్కో రాజా’, ‘రక్షణ’, ‘అనగనగా ఓ అతిధి’, ‘జిన్నా’వంటి చిత్రాలలో నటించింది.ఇక చివరిగా ‘మంగళవారం’సినిమాతో మళ్లీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది పాయల్ రాజ్ పుత్. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే మళ్లీ ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహించడం గమనార్హం. మొత్తానికైతే ఈ కాంబోకి అదృష్టం బాగా వరించిందని చెప్పవచ్చు.
Ritu Chaudhary: విష్ణు ప్రియను అడ్డంగా బుక్ చేసిన రీతూ చౌదరి..!
వెంకట లచ్చిమి సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు..
ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ డైరెక్టర్ ముని దర్శకత్వంలో ‘వెంకట లచ్చిమి’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తోంది. మొత్తం ఈ సినిమా ఆరు భాషలలో విడుదల కాబోతుండగా.. త్వరలోనే ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయింది. ఇలా ఒకవైపు వరుస సినిమాలు ప్రకటిస్తూ.. మరొకవైపు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలతో, వ్యక్తిగత విషయాలతో అభిమానులకు చేరువవుతోంది. ఇప్పుడు తాజాగా ఊహించని గెటప్ లో కనిపించి, అందరిని ఆశ్చర్యపరిచింది పాయల్ రాజ్ పుత్. తాజాగా ఈమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా.. కుర్రాళ్ళు సైతం ఫిదా అవుతున్నారు.
టవల్తో అందాల జాతర చేసిన పాయల్ రాజ్ పుత్..
తాజాగా పాయల్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ పెడుతూ.. అందులో టవల్ తో దర్శనమిచ్చింది. అంతేకాదు ఆ వీడియోలో “రియాలిటీ ఆఫ్ బీయింగ్ ఆన్ యాక్టర్” అంటూ కామెంట్ చేసింది. అంతేకాదు ఇదే విషయాన్ని ఆమె కాప్షన్ గా కూడా జోడించడం గమనార్హం.ఈ వీడియో కాస్త వైరల్ గా మారగా.. ఈ పోస్ట్ పై పలువురు నెటిజెన్స్ పలు రకాలుగా కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నెటిజన్సు ఇంత బరితెగించావేంటి అని కామెంట్ చేయగా.. మరికొంతమంది షూటింగ్ సెట్ లో ఉన్నప్పుడు హీరోయిన్ కష్టాలు ఇలాగే ఉంటాయా అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా చూసే వారి విజన్ ను బట్టే అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయని, ఇంకొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే టవల్తో కనిపించి అందాల జాతరతో యువతకు నిద్ర లేకుండా చేసింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
?utm_source=ig_web_copy_link