IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) మరికొన్ని గంటల్లోనే ప్రారంభం కాబోతుంది. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు అయింది. మార్చి 22వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు ఈ మెగా టోర్నమెంట్ కొనసాగనుంది. మార్చి 22వ తేదీన అంటే శనివారం రోజున ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటుకు ఓపెనింగ్ సెర్మనీ కూడా జరగనుంది. దీనికోసం ప్రత్యేకంగా… బాలీవుడ్ తారలు కూడా రంగంలోకి దిగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీతం విధ్వంసం కూడా వస్తున్నారు. ఈ మెగా ఈవెంట్ నేపథ్యంలో… అపర కుబేరులు కూడా వస్తారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India ).
Also Read: Chahal T-shirt: ఎవడి డబ్బు వాడే సంపాదించుకోవాలి..చాహల్ టీ-షర్ట్ ఫోటో వైరల్ ?
ఐపీఎల్ మ్యాచ్ ల టైమింగ్స్ ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన టైమింగ్స్ గతం లో తరహాలోనే ఉండనున్నాయి. సాయంత్రం 7:30 గంటలకు… ఐపీఎల్ మ్యాచ్ లు ప్రారంభమవుతాయి. శనివారం అలాగే ఆదివారం రోజున రెండు మ్యాచ్లు ఉంటాయి. ఆ సమయంలో మధ్యాహ్నం మూడున్నర గంటలకు మొదటి మ్యాచ్ జరుగుతుంది. రెండో మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు నిర్వహిస్తారు.
ఐపీఎల్ 2025 ఎలా ఉచితంగా చూడాలి ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఈసారి జియో యాప్ లో రావడం లేదు. ఇటీవల జియో అలాగే హాట్ స్టార్ రెండు ఒకటయ్యాయి. కాబట్టి జియో హాట్ స్టార్ లో… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ మ్యాచులు వస్తాయి. ఈ మేరకు ఇప్పటికే జియో కూడా ప్రకటన చేసింది. జియో నెట్వర్క్ ఉన్నవారు… ఈ మ్యాచ్లు ఉచితంగానే చూడవచ్చు. మిగతా యూజర్లు.. కచ్చితంగా రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుందని సమాచారం.
మొదటి మ్యాచ్ ఎవరి మధ్య ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… మొదటి మ్యాచ్కు రంగం సిద్ధమైంది. కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మొదటి మ్యాచ్ నిర్వహిస్తారు. ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య బిగ్ ఫైట్ ఉంటుంది. శనివారం రోజున రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
మొదటి మ్యాచ్ కు వర్షం గండం?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటుకు సంబంధించిన మొదటి మ్యాచ్ కు వర్షం అడ్డంకి గా మారుతోంది. శనివారం రోజున పశ్చిమ బెంగాల్లో విపరీతంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తాజాగా ప్రకటించింది. దీంతో మొదటి మ్యాచ్ రద్దు అయ్యే ప్రమాదం కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే వర్షం ప్రభావం ఉన్న నేపథ్యంలో టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వర్షం ఆగిపోవాలని మ్యాచ్ జరగాలని కోరుకుంటున్నారు.