Ritu Chaudhary: గత కొన్ని రోజులుగా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ పేరిట చాలామంది ఇప్పుడు చిక్కుల్లో పడ్డారని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రజలను, వారి ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని, అలా క్లిక్ చేస్తే చాలు.. ఇలా డబ్బులు వచ్చేస్తాయి అంటూ బెట్టింగ్ రొంపులోకి దింపుతున్నారు. ముఖ్యంగా తమ అభిమాన నటీనటులు చెప్పింది నిజమని నమ్మిన ఎంతోమంది.. వీరు చెప్పిన బెట్టింగ్ యాప్ లను సైతం డౌన్లోడ్ చేసుకొని మరీ అందులో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ భారీగా నష్టపోతున్నారు. ముఖ్యంగా అప్పులు చేసి మరీ బెట్టింగ్ యాప్ లో డబ్బులు పెట్టిన వాళ్ళు.. అప్పులు తీర్చుకోలేక చివరికి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రజల ప్రాణాలను కాపాడడానికి రంగంలోకి దిగిన ప్రభుత్వాలు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వారిపై కేసు నమోదు చేస్తున్నారు. ఇక అందులో భాగంగా విచారిస్తూ విస్తుపోయే నిజాలు బయటకు రప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మొదలుకొని యూట్యూబర్లు, సినిమా నటీనటులు ఈ బెట్టింగ్ ప్రమోషన్ కేసులో చిక్కుకున్నారు. ముఖ్యంగా దాదాపు 74 మందిని ఐడెంటిఫై చేయగా.. అందులో పలువురు సెలబ్రిటీలు, హీరో, హీరోయిన్లు కూడా ఉన్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమందిపై కేసు నమోదు అవ్వగా.. మరొకవైపు మియాపూర్ పోలీస్ స్టేషన్లో దాదాపు 25 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు అయింది. అందులో రీతూ చౌదరి, విష్ణుప్రియ ఉన్నట్టు తెలిసిందే.
ఒక్కో బెట్టింగ్ యాప్ కోసం రూ.90,000..
ఇదిలా ఉండగా తాజాగా సెలబ్రిటీలను ఒక్కొక్కరిగా విచారణకు పిలుస్తూ.. పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారు. ఆ విచారణలో భాగంగా ఆశ్చర్యకర విషయాలు కూడా బయటకి వస్తున్నాయి. నిన్న విష్ణు ప్రియను పోలీసులు విచారించగా.. ఆమె దాదాపు 15 బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశానని, ఒక్క నిమిషం నిడివున్న ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా సుమారుగా ఒక్కో దానికి సుమారు రూ.90, 000 వసూలు చేసినట్లు కూడా ఒప్పుకుంది. దీంతో అధికారులు ఈమె బ్యాంకు ఖాతాను డీటెయిల్స్ ను తీసుకొని, ఈమె ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
విష్ణు ప్రియను అడ్డంగా బుక్ చేసిన రీతూ చౌదరి..
ఇక విచారణలో భాగంగా రీతూ చౌదరిని కూడా పోలీసులు విచారణ జరపగా.. అందులో విష్ణు ప్రియను అడ్డంగా బుక్ చేసింది రీతూ చౌదరి.విచారణలో భాగంగా..” తనకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయం తనకు విష్ణు ప్రియనే చెప్పిందని.. బెట్టింగ్ యాప్స్ ను ఎలా ప్రమోట్ చేయాలో తనకు తెలియదని, దీని గురించి పూర్తి వివరాలు తనకు విష్ణు ప్రియ నేర్పించిందని, ఆ వీడియో ఎలా చేయాలి.. ఎలా ప్రమోట్ చేయాలి అనే విషయం మొత్తం విష్ణుప్రియనే చెప్పింది” అంటూ విష్ణుప్రియను అడ్డంగా బుక్ చేసింది రీతూ చౌదరి. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా రీతూ చౌదరి ఇప్పుడు విష్ణుప్రియను బాగా అడ్డంగా ఇరికించేసింది. మరి దీనిపై విష్ణు ప్రియ ఏ విధంగా స్పందిస్తుందో అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇక వీరితోపాటు హీరో రానా (Rana ), ప్రకాష్ రాజ్ (Prakash Raj), యూట్యూబర్ హర్ష సాయి (Harsha Sai) టేస్టీ తేజ (Tasty Teja), శోభా శెట్టి (Shobha Shetty) తో పాటు దాదాపు 75 మందికి పైగా సెలబ్రిటీలు.. ఇలా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసి ఇప్పుడు కేసుల్లో ఇరుక్కున్నారని చెప్పవచ్చు.