BigTV English
Advertisement

People Media Factory: ఫ్యాక్టరీ నుంచి సినిమాలు వస్తున్నాయి కానీ, లాభాలు రావట్లేదు

People Media Factory: ఫ్యాక్టరీ నుంచి సినిమాలు వస్తున్నాయి కానీ, లాభాలు రావట్లేదు

People Media Factory: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి. వాటిలో టక్కున వినిపించే పేర్లు హారిక హాసిని క్రియేషన్స్, మైత్రి మూవీ మేకర్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వంటి ఎన్నో సినిమాలను నిర్మించే సంస్థలు ఉన్నాయి. వీటన్నిటిలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రత్యేకమని చెప్పాలి. ఈ నిర్మాణ సంస్థకు సంబంధించి చాలా మంది దగ్గర అడ్వాన్సులు ఉన్నాయి. ఈ నిర్మాణ సంస్థ ఇప్పటికే దాదాపు 40 సినిమాలను దాటి నిర్మించింది. 100 సినిమాలను తీయాలని ఉద్దేశ్యంతో టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీని స్థాపించినట్లు ఇదివరకే చాలాసార్లు చెప్పుకొచ్చారు.


అయితే ఇప్పటివరకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక రిలీజ్ అయిన సినిమాలు సక్సెస్ రేట్ గురించి మాట్లాడితే కేవలం ఐదు నుంచి పది సినిమాలు మాత్రమే వినిపిస్తాయి. మిగతా సినిమాలన్నీ కూడా అంతంత మాత్రమే ఆడాయి. ఒక దర్శకుడికి కావాల్సిన సదుపాయాలు ఇవ్వడం, సినిమాకు కావలసిన దానికంటే ఎక్కువగా ఖర్చు పెట్టడం వంటి క్వాలిటీస్ ఈ నిర్మాణ సంస్థకు ఉన్నాయి. ఎంత ఖర్చు పెట్టినా కూడా సినిమాలో క్వాలిటీ లేకపోతే అదంతా వృధాగా మారిపోతుంది.

ఇక రీసెంట్ గా ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన సినిమా మిస్టర్ బచ్చన్. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తో మొదలై డిజాస్టర్ గా మిగిలింది. మొదటి ఈ సినిమాకి విపరీతమైన పాజిటివ్ టాక్ వచ్చింది ఆ తర్వాత మెల్లమెల్లగా నెగిటివ్ టాక్ కూడా మొదలైంది. ఎక్కువగా ఈ సంస్థలో డిజాస్టర్ సినిమాలే వస్తున్నాయి. 2023 వ సంవత్సరం నుంచి మొదలు పెడితే వరుస డిజాస్టర్ సినిమాలు ఈ బ్యానర్ చవి చూసింది.


ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి – డిజాస్టర్
టక్కర్ – డిజాస్టర్
ఆదిపురుష్ – డిజాస్టర్ (డిస్ట్రిబ్యూషన్)
బ్రో అవతార్ – డిజాస్టర్
రామబాణం- డిజాస్టర్
బబుల్గం – డిజాస్టర్
ఈగల్ – యావరేజ్
మనమే – హిట్ ఫర్ డిస్ట్రిబ్యూటర్
మిస్టర్ బచ్చన్ – డిజాస్టర్
స్వాగ్ – యావరేజ్
విశ్వం – యావరేజ్

ఈ విషయాలన్నీ ఒక ఎత్తు అయితే శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన సినిమా విశ్వం. ఈ సినిమాతో శ్రీను వైట్ల ఇస్ బ్యాక్ అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు గోపీచంద్. ఇకపోతే కేవలం రెండు రోజుల్లో 100% రికవరీ అని పోస్టర్ కూడా వదిలేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్. శ్రీను వైట్ల ఒక హిట్ సినిమా కొడితే ఆ జెన్యూన్ టాక్ ఎలా ఉంటుందో చాలామందికి తెలుసు. కానీ ఈ సినిమా గురించి కూడా పెద్దగా బయట ఏమి వినిపించలేదు. ఈ సినిమా కూడా అంతంత మాత్రమే ఆడింది. ఏదేమైనా ఇక వరుస డిజాస్టర్ సినిమాలు చేస్తున్న ఈ బ్యానర్ మళ్లీ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తుందని చాలామంది బిలీవ్ చేస్తున్నారు. ధమాకా లాంటి సూపర్ హిట్ సినిమా వస్తే 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది. కానీ పదిలో ఒకటి తగలడం పక్కన పెడితే 9 పోవడం వలన బ్యానర్ కున్న రెప్యుటేషన్ కూడా పోతుంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×