BigTV English

Raja Saab Glimpse: ‘రాజాసాబ్’ గ్లింప్స్ రిలీజ్.. ప్రభాస్ ఏమున్నాడురా బాబు

Raja Saab Glimpse: ‘రాజాసాబ్’ గ్లింప్స్ రిలీజ్.. ప్రభాస్ ఏమున్నాడురా బాబు

Prabhas Raja Saab Glimpse Released: ప్రభాస్ ఇటీవల ‘కల్కి 2898 ఏడీ’ మూవీతో వచ్చి ఫుల్ ట్రీట్ ఇచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసును షేక్ చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల్ని ఆకట్టుకుంది. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ నిర్మించాడు. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన కల్కి ఇప్పటికీ దాదాపు రూ.1100 కోట్లు కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరచింది.


దీంతో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. అలాగే బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత తెలుగు సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు కొల్లగొట్టిన సినిమాగా కల్కి తన పేరును లిఖించుకుంది. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ వంటి స్టార్ నటీ నటులు కీలక పాత్రలు పోషించారు. అదే సమయంలో రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ వంటి నటులు గెస్ట్ రోల్‌లో కనిపించి అదరగొట్టేశారు.

మొత్తంగా అందరి సహకారంతో ఈ సినిమా బాక్సాఫీసును షేక్ చేసి కలెక్షన్ల వర్షం కురిపించిందనే చెప్పాలి. ఈ మూవీ తర్వాత ప్రభాస్ లైనప్‌లో చాలా సినిమాలు ఉన్నాయి. అందులో ‘రాజాసాబ్’ ఒకటి. ప్రముఖ దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. ఈ మూవీలో ప్రభాస్ సరసన మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. అలాగే రిద్ది కుమార్ కీలక పాత్ర పోషిస్తుంది. వీరితోపాటు బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ ఇందులో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.


Also Read: అప్డేట్ వచ్చిందిరోయ్.. రాజాసాబ్ ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ సెలబ్రేషన్స్ కు రెడీ అవ్వండి

కామెడీ హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తుండగా.. మేకర్స్ నిన్న అంటే ఆదివారం అదిరిపోయే అప్డేట్ అందించారు. ఇందులో భాగంగా ఈ మూవీ నుంచి ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మేరకు ‘రాజాసాబ్’ మూవీ గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు.

రిలీజ్ చేసిన పోస్టర్‌లో ప్రభాస్ లుక్ వేరే లెవెల్లో ఉంది. అందులో ప్రభాస్ స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. బ్లేజర్ వేసుకుని గడ్డంతో కనిపించి చాలా కొత్తగా కనిపించాడు. అయితే ఈ పోస్టర్‌లో ప్రభాస్ ముఖాన్ని మాత్రం కనిపించనివ్వలేదు. అయితే మేకర్స్ చెప్పినట్లుగానే గ్లింప్స్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ చాలా అంటే చాలా క్లాసిక్‌గా కనిపించి అదరగొట్టేశాడు. అతడి లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ గ్లింప్స్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×