BigTV English

Pushpa 2: షాక్ లో పుష్ప టీమ్.. హైకోర్టులో మరో పిటిషన్..!

Pushpa 2: షాక్ లో పుష్ప టీమ్.. హైకోర్టులో మరో పిటిషన్..!

Pushpa 2:అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప’ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారీ కలెక్షన్స్ వసూలు చేసి, సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఈ సినిమా.. అంతే చిక్కులు ఎదుర్కొంటుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా వరుస ఘటనలు కోర్టు కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పుష్పరాజ్ యూనిట్ కి ఇప్పుడు మరో షాక్ తగిలింది. ఇప్పుడు హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు అయింది. పుష్ప 2 సినిమాకి వచ్చిన లాభాలను జానపద కళాకారుల పింఛన్ కోసం కేటాయించాలంటూ లాయర్ నరసింహారావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం కింద పిల్ వేసిన విషయం తెలిసిందే. ఈ పుష్ప -2 టీమ్ కి భారీగా లాభాలు వచ్చాయని, ఈ విషయాన్ని మూవీ నిర్మాతలే స్వయంగా ప్రకటించినట్టు ఆయన కోర్టుకి కూడా వివరించారు.


పుష్ప టీం కి వ్యతిరేకంగా హైకోర్టులో పిల్..

నిజానికి పుష్ప సినిమాకు ఇన్ని లాభాలు రావడానికి కారణం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలే.. ప్రభుత్వం సహకారంతోనే ఇన్ని లాభాలు వచ్చాయి. కాబట్టి ఆ లాభాలను సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం జానపద కళాకారుల పింఛన్ కోసం మళ్ళించాలని కోరారు. ఇక తెలంగాణ హోమ్ శాఖ ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చి మరీ పర్మిషన్ కూడా ఇచ్చింది కాబట్టి, ఆ లాభాలలో వాటాలను పొందే హక్కు కళాకారులకు ఉందని నరసింహారావు కూడా చెప్పుకొచ్చారు. కానీ లాభాల విషయం ఎప్పుడో అయిపోయింది గాని కోర్టు ప్రశ్నించిన దానికోసమే ఇప్పుడు మళ్లీ పిల్ వేసినట్టు నరసింహారావు తెలియజేశారు. ఇందుకు సంబంధించి పూర్తి కాపీలను సబ్మిట్ చేయాలంటూ కోర్టు రెండు వారాల వరకు విచారణ వాయిదా వేసింది. దీంతో ఇప్పుడు ఈ విషయం కాస్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.


పుష్ప మేకర్స్ కు బిగుసుకుంటున్న ఉచ్చు..

మొత్తానికైతే పుష్ప 2 టీం మొన్నటి వరకు సంధ్యా థియేటర్ ఘటనతో ఉక్కిరి బిక్కిరి అయింది. ఇక ఆ ఘటన నుండి పూర్తిగా బయటపడలేదు. ముఖ్యంగా ఆ తొక్కిసలాటలో రేవతి మరణించగా.. ఆమె కొడుకు శ్రీతేజ్ గాయపడి ఇంకా హాస్పిటల్ లోనే చికిత్స తీసుకుంటున్నారు. కానీ సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇప్పుడిప్పుడే ఈ సినిమా గురించి చర్చ జరగడం ఆగిపోయింది. కానీ అంతలోనే వాటాల గురించి పిల్ వేయడంతో మళ్ళీ పుష్ప 2 గురించి చర్చ మొదలవడంతో చిత్ర బృందంతో పాటు అభిమానులు కూడా షాక్ అవుతారు. మరి దీనిపై పుష్ప ప్రొడ్యూసర్లు ఏదైనా స్పందిస్తారేమో చూడాలి. ఇంకా అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పుష్ప. ఆ సినిమా సీక్వెల్ గా విడుదలైన చిత్రం పుష్ప 2. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన ఈ సినిమా రూ.1800 కోట్ల కలెక్షన్స్ తో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రెండవ స్థానాన్ని దక్కించుకుంది. ఇక అంత ఘన విజయం సాధించింది. కానీ ఇప్పుడు ఇలాంటి కేసులు మేకర్స్ మెడకు ఉచ్చు బిగిస్తున్నాయని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×