Sushant Singh Rajput: ఏ రంగంలో అయినా నెపోటిజం అనేది కామన్. ముఖ్యంగా సినీ పరిశ్రమలో నెపోటిజం అనేది ఓపెన్ సీక్రెట్. అలాంటిది కొన్నేళ్ల క్రితం బాలీవుడ్‌లో ఈ నెపోటిజం అనే పదం తెగ వైరల్ అయ్యింది. దానికి కారణం యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు సుశాంత్. కానీ తను ఆత్మహత్య చేసుకోలేదని, అది హత్య అని తన ఫ్యాన్స్ ఇప్పటికీ అనుమానిస్తున్నారు. తాజాగా ఒక బాలీవుడ్ నటుడు కూడా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై ఓపెన్ కామెంట్స్ చేశాడు. బీ టౌన్‌లో గ్యాంగ్స్ ఉన్నాయని, దానివల్లే సుశాంత్ మరణించాడని కెమెరా ముందే వ్యాఖ్యలు చేసి అందరినీ షాక్‌కు గురిచేశాడు.
ఆమెతో రిలేషన్
‘ఖోస్లా కా ఘోస్లా’, ‘ట్రాఫిక్ సిగ్నల్’, ‘భేజా ఫ్రై’, ‘మిథ్యా’ లాంటి సినిమాలు, వెబ్ సిరీస్‌లతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు రణవీర్ షోరే (Ranvir Shorey). తాజాగా బిగ్ బాస్ ఓటీటీ 3లో కాంట్రవర్సీ క్రియేట్ చేసిన నటుడిగా కూడా తన పేరు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతే కాకుండా బాలీవుడ్‌లోని బడా నిర్మాత అయిన మహేశ్ భట్ కూతురు అయిన పూజా భట్‌తో కొన్నాళ్లు రిలేషన్‌లో కూడా ఉన్నాడు. అది కూడా కొన్నాళ్ల పాటు ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఎన్నో బాలీవుడ్ విశేషాలను పంచుకున్నాడు రణవీర్. ఒక ఇంటర్వ్యూలో సుశాంత్ మరణంపై స్పందించాడు ఈ నటుడు.
గట్టిగా మాట్లాడతాను
‘‘నాకు మహేశ్ భట్‌తో బాగుండేవాడిని. నేను పూజా భట్‌తో ప్రేమలో పడేవరకు అంతా బాగానే ఉంది. నేను ఆయనపై చూపించే గౌరవం అంతా, ఆ ప్రవర్తన అంతా చాలా డూప్లికేట్ అని నాకు అప్పుడు అర్థమయ్యింది. బాలీవుడ్‌లో గ్యాంగ్స్ ఉంటాయి. కొన్ని గ్రూప్స్ అంతా కలిసి కష్టపడి పైకి వచ్చిన వారిని బయటికి గెంటేస్తాయి. ఇండస్ట్రీలో చాలామందికి ఈ విషయం తెలుసు. కానీ ఎవరూ ఈ విషయాన్ని ఓపెన్‌గా చెప్పరు. కొన్నేళ్ల క్రితం సుశాంత్ విషయంలో కూడా ఇదే జరిగింది. అందుకే నేను మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. దీని గురించి ఎవరిని అడిగినా ఆఫ్ ది రికార్డ్ చెప్తారు. కానీ నేను అలా కాదు.. ఆన్ ది రికార్డ్ చెప్తాను. నాకేం ప్రాబ్లమ్ లేదు’’ అని చెప్పుకొచ్చాడు రణవీర్ షోరే.
Also Read: ‘కంగువా’ డిశాస్టర్.. భర్తకు సపోర్ట్ చేస్తూ జ్యోతిక కామెంట్స్..
మంచి ఫ్రెండ్స్
‘‘ఒకరిపై గ్యాంగ్ అంతా ఎగబడడం, వారిని బయటికి గెంటేయడం, ఒకరిని మోకాళ్లపై నిలబెట్టడం, ఒకరి కెరీర్ నాశనం చేయడం.. ఇలాంటివి చాలా జరుగుతాయి. ఇది నిజం. సుశాంత్, నేను చాలా క్లోజ్. మేము ఫ్రెండ్స్‌గా ఉండేవాళ్లం. షూటింగ్ సమయంలో కలిసి చాలా సమయాన్ని గడిపాం. కలిసిపోయాం. సుశాంత్ చాలాసార్లు మా ఇంటికి కూడా వచ్చాడు’’ అని తెలిపాడు రణవీర్ షోరే. 2019లో విడుదలయిన ‘సోంచిరియా’ అనే సినిమాలో రణవీర్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) కలిసి నటించారు. ఆ తర్వాత ఏడాదికే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన అపార్ట్మెంట్‌లో ఉరి వేసుకొని చనిపోయాడు. ఇప్పటికే ఈ కేసు కోర్టులో కొనసాగుతోంది.