BigTV English

Pindam : పిండం.. హర్రర్ థ్రిల్లర్.. టీజర్ తోనే వణుకు..

Pindam : పిండం.. హర్రర్ థ్రిల్లర్.. టీజర్ తోనే వణుకు..

Pindam: హీరో శ్రీరామ్, ఖుషీ రవి కాంబోలో తెరకెక్కిన సరికొత్త హారర్ థ్రిల్లర్ చిత్రం పిండం.’ది స్కేరియస్ట్ ఫిల్మ్’అనే టాగ్ లైన్ తో ముందుగానే మూవీ ఎంత భయంకరంగా ఉంటుందో స్టేట్మెంట్ ఇస్తున్న ఈ మూవీ నుంచి సరికొత్త టీజర్ విడుదల అయింది. ” ఇది అన్ని కుక్కల్లా లేదే.. ఇదేదో వేరే వింత జంతువులా ఉంది.. వెంటనే దీన్ని పూడ్చి పెట్టండి లేకపోతే ఊరికే ప్రమాదం” అంటూ ఈశ్వరి రావ్ డైలాగ్ తో ప్రారంభమయ్యే ఈ టీజర్ స్టార్టింగే భయంతో పాటు నెక్స్ట్ ఏమి జరుగుతుంది అన్న ఆసక్తిని రేపుతోంది.


అలాగే ఆ తర్వాత ఈశ్వరి రావు ఒక ఇంట్లోకి వెళ్లడం అక్కడ ఆత్మ ఆవహించిన ఒక అమ్మాయితో మాట్లాడడం.. ఇలా మంత్ర తంత్రాలు ప్రేతాత్మలు కాన్సెప్ట్ ని ఈ సినిమాలో హై లెవెల్ లో చూపిస్తున్నాం అని టీజర్ తో స్పష్టం చేశారు. ఇక ఆ తర్వాత మీ కెరియర్ లో మోస్ట్ కాంప్లికేటెడ్ కేస్ ఏదైనా ఉందా అని అవసరాల శ్రీనివాస్ ఈశ్వరి రావు ని అడుగుతాడు. ఉంది అది చాలా ప్రత్యేకమైనది. దాన్ని నేను అసలు ఎప్పటికీ మర్చిపోలేను. మళ్లీ ఎప్పుడు ఎక్కడ అటువంటి ఇన్సిడెంట్ గురించి వినింది లేదు. అది ఒక అపారమైన శక్తి కలిగిన ఆత్మ కథ.. అంటూ ఈశ్వరి రావు చెప్పడంతో నెక్స్ట్ స్టోరీ ఏమిటా అని ఒక క్యూరియాసిటీ జనరేట్ అవుతుంది.

ఇక ఆ తర్వాత శ్రీకాంత్ శ్రీరామ్ ఫ్యామిలీ ఉంటున్న ఇంట్లో కొన్ని అనుకోని సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటూ ఉంటాయి. దాంతో కుటుంబం మొత్తం ఏదో తెలియని భయంతో వణికి పోతుంటారు.. మరో పక్క పాపకు ఆత్మ ఆవహించినట్టు కొన్ని సన్నివేశాలను చూపెడతారు. ఒక్కసారి వెన్నులో వణుకు పుట్టించేలా ఉంటాయా సీన్స్. ఇంతకీ ఈ మూవీలో మాట్లాడే ఆ ఆత్మ ఎవరిది? ఎందుకు దానికి అంత శక్తి వచ్చింది? నెక్స్ట్ ఏం జరగబోతోంది అన్న ఉత్కంఠతను రేకెత్తించే విధంగా టీజర్ ఉంది.


నిజంగా ఈ మూవీ టీజర్ రాబోయే చిత్రంపై హైప్ ను పెంచడంలో ఫుల్ సక్సెస్ అయింది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ‘మన చుట్టూ కళ్లకు కనిపిస్తూ ఉన్న ఈ భౌతిక ప్రపంచం చాలా చిన్నది. దాని సరిహద్దులు మనకు తెలుస్తాయి కానీ లోపల ప్రపంచానికి సరిహద్దులు లేవు. అది అంత తేలికగా మనకు అర్థం కాదు..’అంటూ ఈశ్వరి రావు డైలాగ్ తో టీజర్ ని ముగించారు.

హారర్ ఎలిమెంట్ తో ఇప్పటికే చాలా చిత్రాలు వచ్చాయి కానీ ఇందులో ఆత్మ ..దాని శక్తి అంటూ ఏదో కాస్త కొత్తగా ప్రయోగం చేస్తున్నారు అని అర్థమవుతుంది.టీజర్ లో ఉన్న ప్రతి సీన్ ఒక హారర్ ఎలిమెంట్ ని ఎలివేట్ చేస్తూ ఉంది.టీజర్ లో డైలాగ్స్ ఎంత హైలెట్ గా ఉన్నాయో వెనక వచ్చిన బ్యాక్ గ్రౌండ్ అంతకంటే హైలైట్ గా ఉంది. షూటింగ్ పూర్తి అయిపోయిన ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకులను భయపెట్టడానికి థియేటర్లలో రానుంది.

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×