BigTV English

Chhaava: ఛావా మూవీపై పీఎం మోదీ ప్రశంస.. ఏమన్నారంటే..?

Chhaava: ఛావా మూవీపై పీఎం మోదీ ప్రశంస.. ఏమన్నారంటే..?

Chhaava..మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఇటీవల వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఛావా సినిమా విడుదలైన విషయం తెలిసిందే. శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ (Vicky kaushal) ఆయన భార్య ఏసు భాయి పాత్రలో రష్మిక మందన్న(Rashmika mandanna) ఒదిగిపోయారు. విడుదలైన రోజు నుంచి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ.. అత్యధిక కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతోంది. ముఖ్యంగా హాలిడే, వర్కింగ్ డే అనే తేడా లేకుండా ప్రతిరోజు హౌస్ ఫుల్ థియేటర్లతో సంచలనం సృష్టిస్తోంది. ఇలాంటి సినిమాపై భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ సినిమా కాస్త హెడ్ లైన్ గా మారిపోయింది.


ఛావా మూవీ పై ప్రధానమంత్రి ప్రశంసలు..

ఇటీవల జరిగిన 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. పలు అంశాలపై చర్చించిన ఆయన, ఛావా(Chhaava ) సినిమాపై కూడా మాట్లాడుతూ ప్రశంసలు కురిపించారు. “ముఖ్యంగా ఛావా సినిమా ప్రస్తుతం హెడ్లైన్ గా మారిందని తెలిపిన పీఎమ్.. దేశంలో మరాఠీ భాష చాలా గొప్ప దళిత సాహిత్యాన్ని అందించిందని కొనియాడారు. మహారాష్ట్ర ప్రజలు గతంలో సైన్స్, ఆయుర్వేదం , లాజికల్, రీజనింగ్ వంటి వాటికి అద్భుతమైన కృషి చేశారని, మహారాష్ట్ర, ముంబై కేవలం హిందీ సినిమాలు మాత్రమే కాకుండా మరాఠీ చిత్రాల స్థాయిని పెంచడంలో కీలక పాత్ర పోషించిందని” తెలిపారు.ప్రస్తుతం ఛావా సినిమాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు దేశ ప్రధాని ఈ సినిమా గురించి గొప్పగా చెప్పడంతో సినిమా క్రేజ్ మరింత పెరిగిపోయిందని చెప్పవచ్చు.


ఛావా మూవీ కలెక్షన్స్..

ప్రముఖ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ (Lakshman Utkar) దర్శకత్వంలో.. ప్రముఖ నిర్మాత దినేష్ విజన్(Dinesh Vijan).. మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.310.50 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. రూ.31 కోట్లతో అధ్భుతమైన ఓపెనింగ్ ను సాధించింది. వారాంతంలో శనివారం రూ.37కోట్లు, ఆదివారం రూ.48.5 కోట్లు సాధించింది. ఇకపోతే ఈ సినిమాలో ఔరంగజేబు పాత్రలో అక్షయ్ నటించగా.. డయానా పెంటీ, అశుతోష్ రాణా, దివ్య దత్త, వినీత్ కుమార్ సింగ్ తో పాటు పలువురు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఏది ఏమైనా విక్కీ కౌశల్ ఈ సినిమాల్లో శంభాజీ మహారాజ్ క్యారెక్టర్ లో అద్భుతంగా ఒదిగిపోయి నటించారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈయన పెర్ఫార్మెన్స్ కి సంబంధించిన మేకోవర్ వీడియోని మేకర్స్ విడుదల చేయగా.. ఆయన ఈ సినిమా కోసం చాలా కష్టపడినట్లు తెలుస్తోంది . కత్తిసాము తో పాటు యుద్ధంలో పలు మెలకువలు కూడా నేర్చుకున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ పాత్ర కోసం 100 కిలోల బరువు కూడా పెరిగారట విక్కీ కౌశల్.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by @prayagraj_mahakumbh13 (@prayagraj_mahakumbh13)

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×