BigTV English

Pallavi Prashant arrest : బిగ్ బాస్ విన్నర్ పై పోలీస్ కేసు.. అసలు సంగతి అదే..

Pallavi Prashant arrest : బిగ్ బాస్ విన్నర్ పై పోలీస్ కేసు.. అసలు సంగతి అదే..
Big Boss season 7 winner

Pallavi Prashant arrest : తెలుగు బుల్లితెరపై మోస్ట్ పాపులర్ రియాలిటీ షో గా గుర్తింపు తెచ్చుకున్న షో బిగ్ బాస్. నిన్నటితో ఈ షో కి సంబంధించిన ఏడవ సీజన్ కూడా సక్సెస్ఫుల్గా పూర్తయింది. అందరూ అనుకున్నట్టుగానే ఈ సీజన్లో కామన్ మ్యాన్ గా ..రైతుబిడ్డగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన పల్లవి ప్రశాంత్ విన్నర్గా నిలిచాడు.ఉల్టా పుల్టా అనే సరికొత్త కాన్సెప్ట్ తో మంచి వినోదాన్ని పంచుతూ 15 వారాల పాటు బుల్లితెర ప్రేక్షకులను ఈ షో బాగా ఎంటర్టైన్ చేసింది. అయితే ఇంతకుముందు ఏ సీజన్లో జరగని విధంగా ఈ సీజన్ లో బిగ్ బాస్ విన్నర్ పై పోలీస్ కేసు నమోదు చేయబడింది.ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి..


మొత్తం ఆరుగురు ఫైనలిస్టుల్లో ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ రాగా.. లాస్ట్ కి బిగ్ బాస్ ఇంట్లో అమర్‌దీప్ చౌదరి, పల్లవి ప్రశాంత్ మిగిలారు.. ఇక ఈ ఇద్దరి అభిమానులు ఆదివారం సాయంత్రమే అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు ఫినాలే కోసం చేరుకున్నారు. ఫినాలే ఎపిసోడ్ పూర్తి అయిన వెంటనే వీళ్ళ కారణంగా బయట గొడవ మొదలైంది. ఇద్దరు రెండు గ్రూపులుగా ఏర్పడి ఒక రేంజ్ లో కొట్టుకోవడమే కాకుండా.. కొందరు పల్లవి ఫ్యాన్స్ 

అమర్‌దీప్ చౌదరి ఫ్యామిలీతో కలిసి వెళ్తున్న కారుపై దాడి కూడా చేశారు. అతని కారును తుక్కుతుక్కుగా కొట్టడమే కాకుండా.. లోపల నుంచి బయటకు రావాలి అంటూ అసభ్యకరమైన పదజాలంతో తిట్టారు.


 అయితే విషయం అక్కడితో ఆగలేదు.. మరీ రెచ్చిపోయిన అభిమానులు కనిపించిన ప్రతి వాహనంపై దాడి చేశారు. అదే టైంలో ఆ ప్రదేశంలో వెళ్తున్న అశ్విని శ్రీ, గీతూ రాయల్ కార్ల పై కూడా దాడి చేసి ధ్వంసం చేశారు. ఇక హైదరాబాద్ సిటీ బస్సుపై కూడా ఈ నేపథ్యంలో కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో సిటీ బస్‌ అద్దాలు పగిలిపోయాయి. పల్లవి ప్రశాంత్ అభిమానులు చేసిన ఈ దాడులు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారాయి.

తమ కార్లను ధ్వంసం చేసినందుకుగాను..గీతూ రాయల్, అశ్విని శ్రీ.. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ పై కూడా కేసు నమోదు అయినట్టు తెలుస్తోంది.

వాహనాలే కాదు.. కొందరు మనుషులపై కూడా దాడి జరిగిందట. ఈ కేసుకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

 అంతేకాదు ఎవరూ కేసు నమోదు చేయకుండానే.. జరిగిన సంఘటనల ఆధారంగా.. బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై జూబ్లీహిల్స్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.. ఇదే విషయాన్ని వాళ్ళు మీడియాకు వెల్లడించారు.147, 148, 290, 353, 427 రెడ్ విత్, 149 సెక్షన్ల కింద పల్లవి పై కేసు నమోదు అయినట్టు తెలుస్తోంది. అలాగే దాడిలో పాల్పడిన పల్లవి అభిమానులలో కొందరిని గుర్తించగా .వారిపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇలా  హౌస్ లో ఉన్నప్పుడు కాంట్రవర్సీకి నెలవుగా ఉన్న పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చాక మరింత సంచలనమైన ఇష్యులో ఇరుక్కున్నాడు. ఇక ఈ విషయం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

Pallavi Prashant, Anudeep Chowdhary, Big Boss season 7, Big Boss season 7 winner, Pallavi Prashant police case

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×