Allu Arjun Case Update:ప్రస్తుతం అల్లు అర్జున్ (Allu Arjun) కేస్ సర్వత్రా ఉత్కంఠకు దారితీస్తోంది. అసలు విషయంలోకెళితే డిసెంబర్ 4వ తేదీన ‘పుష్ప 2’ బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణించింది. ఆమె కొడుకు శ్రీ తేజ్ ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు పోలీసులు పర్మీషన్ నిరాకరించినా.. అల్లు అర్జున్ ర్యాలీ నిర్వహించుకుంటూ వచ్చారు. ఇలా ఈ కారణాల వల్ల అల్లు అర్జున్ పై కేసు నమోదయింది.దీంతో డిసెంబర్ 13వ తేదీన ఆయనను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించగా.. కానీ మభ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు.
కౌంటర్ దాఖలు చేసిన పోలీసులు..
ఇక తర్వాత అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టు లో విచారణకు వర్చువల్గా హాజరయ్యారు. ఆ సమయంలో కోర్టు పోలీసులతో కౌంటర్ దాఖలు చేయమని కోరగా.. పోలీసులు సమయం కోరారు. దీంతో తదుపరి విచారణను జనవరి 10వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. అందులో భాగంగానే ఈరోజు మరొకసారి నాంపల్లి కోర్టులో విచారణ జరగగా.. చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈరోజు విచారణ జరగగా.. తదుపరి విచారణను జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది నాంపల్లి కోర్ట్. ఇకపోతే పోలీసులు కౌంటర్ దాఖలు చేయడంతో అందులో ఏం పొందుపరిచారు? అనే విషయంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.
అల్లు అర్జున్ ను విచారించిన చిక్కడపల్లి పోలీసులు..
అసలు విషయంలోకి వెళ్తే.. మధ్యంతర బెయిల్ మీద ఉన్న అల్లు అర్జున్.. బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదు. అటు సినీ సెలబ్రిటీలు కూడా ఎవరు బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లలేదు. కానీ అల్లు అర్జున్ జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు రావడంతో ఆయనను పరామర్శించడానికి సెలబ్రిటీలు క్యూ కట్టారు. దీంతో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సెలబ్రిటీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మహిళ చనిపోతే ఇండస్ట్రీ నుంచి పరామర్శించడానికి ఎవరూ రాలేదు. కానీ ఒక స్టార్ జైలుకెళ్ళి వచ్చినంత మాత్రాన వారి ఇంటికి క్యూ కట్టారు..ఆ స్టార్ కి కాలు పోయిందా? కన్ను పోయిందా? అంటూ ఫైర్ అయ్యారు. అయితే అదే రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి మరీ తన తప్పు ఏమీలేదని అల్లు అర్జున్ చెప్పడంతో.. పోలీసులు సీరియస్ అయ్యారు. రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి? అంటూ ఫైర్ అవుతూ మద్యంతర బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని అనుకున్నారు. కానీ హైకోర్టులో పిటిషన్ వేయలేదు. అనంతరం నేరుగా చిక్కడపల్లి పోలీసులు మూడున్నర గంటల పాటు అల్లు అర్జున్ ని విచారించారు.
రెగ్యులర్ బెయిల్ కోసం జనవరి 10 వరకు ఎదురీత..
ఈ విచారణ తర్వాత ఆయన మధ్యంతర బెయిల్ రద్దు పై పిటిషన్ దాఖలు చెయ్యలేదు. కానీ ఇప్పుడు ఈరోజు జరిగిన విచారణలో పోలీసులు కౌంటర్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. మరి అసలు పోలీసులు ఏం తెలిపారు.? జనవరి మూడవ తేదీ జరగబోయే విచారణలో అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ వస్తుందా? ఇక పూర్తి వివరాలు తెలియాలి అంటే జనవరి 10వ తేదీ వరకు ఎదురు చూడాల్సిందే అని సమాచారం.