Dil Raju – Pawan Kalyan : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ (Allu Arjun) కేసు టాపిక్ పై పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో సీరియస్ చర్చ నడిచిందనే టాక్ మొదలైంది. ప్రస్తుతం ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు (Dil Raju) ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా రావాలనే ఆహ్వానాన్ని పట్టుకొని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ వివాదంపై సీరియస్ గా స్పందించారంటూ ప్రచారం మొదలైంది.
పవన్ (Paawan Kalyan) – దిల్ రాజు (Dil Raju) భేటీలో బన్నీ చర్చ
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ కి టైం దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు సంబంధించిన భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా ‘గేమ్ ఛేంజర్’ మూవీ నిర్మాత, ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లారు. ఈ సినిమాకు గెస్ట్ గా హాజరు కావాలంటూ ఆహ్వానించడానికి ఆయన అక్కడికి వెళ్లారు. అయితే ఈ క్రమంలో అల్లు అర్జున్ కేసు గురించి వీళ్లిద్దరి మధ్య ప్రస్తావన వచ్చిందని టాక్ నడుస్తోంది. అందులో భాగంగా దిల్ రాజు అల్లు అర్జున్ కేసు కు సంబంధించిన వివరాలు, ప్రభుత్వ స్పందన, సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన మీటింగ్ గురించిన కీలక విషయాలను పవన్ కి వివరించినట్టు సమాచారం.
పవన్ (Pawan Kalyan) రియాక్షన్ ఇదే…
సంధ్య థియేటర్ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఓ మీడియా చిట్ చాట్ లో మాట్లాడుతూ సీరియస్ అయ్యారు. “గోటితో పోయే విషయాన్ని గొడ్డలి దాకా తీసుకువచ్చారు. అభిమాని మృతి చెందారన్న విషయం తెలియగానే, వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించాలి. అలా చేయకపోవడం వల్ల ఇక్కడ మానవతా దృక్పథం అనేది లోపించినట్టుగా అయింది. బన్నీ మాత్రమే కాదు, టీం అయినా కనీసం రియాక్ట్ అయ్యి ఉండాల్సింది. అంతేకానీ ఈ వివాదంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును సరిగ్గా చెప్పలేదనే కారణంతో అరెస్ట్ చేశారు అని అనడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. బన్నీ స్థానంలో ఒకవేళ రేవంత్ ఉన్నా సరే ఇలాగే చేస్తారు” అని చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది.
ఇక ఇప్పుడేమో ‘గేమ్ ఛేంజర్’ మూవీ రిలీజ్ విషయమై దిల్ రాజు అక్కడికి వెళ్తే, అక్కడ కూడా బన్నీ కేసు విషయంపై సీరియస్ డిస్కషన్ నడిచిందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరోవైపు తాజాగా అల్లు అర్జున్ కేసు విచారణకు రాగా, చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ కేసు కు సంబంధించిన తదుపరి విచారణను జనవరి 3 కు నాంపల్లి కోర్టు వాయిదా వేసింది.