Puri Jagannadh : లైగర్ మూవీ డిస్ట్రిబ్యూటర్లు తనను డబ్బు చెల్లించమిన వేధింపులకు గురిచేస్తున్నారని దర్శకుడు పూరీ జగన్నాథ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఇటీవళ ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని కోరడంతో పోలీసులు గురువారం ఆయన ఇంటి ఆవరణలో భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు.
ఆగస్టు 25న పూరీ జగన్నాధ్ డైరెక్షన్‌లో వచ్చిన లైగర్ అట్టర్ ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. ఫ్లాప్ అయిన దగ్గరి నుంచి పూరీ పరిస్థితిపైనే సనీ టౌన్‌లో తీవ్ర చర్చ జరిగింది. ముంబైలో ఖరీదైన ఫ్లాట్‌ను పూరీ ఖాలీ చేశారని బాలీవుడ్ మీడియా కూడా అనేక కథనాలు రాసింది. పూరీ పనైపోయిందని టాలీవుడ్‌లో కొందరు గుసగుసలాడారు. మరికొందరు.. బాలీవుడ్ పెద్దలే కావాలని ఫ్లాప్ అయ్యేవిధంగా స్కెచ్ వేశారన్నారు.
లైగర్ విడుదలైన తరువాత పూరీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సాయికుమార్ దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. లైగర్ ప్రొడక్షన్‌లో భాగమైన ఛార్మీ కూడా సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకొని దూరంగా ఉంటుంది. లైగర్‌లో కీలక పాత్ర పోషించిన ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కూడా లైగర్ రిలీజ్ తరువాత ఎక్కడా దాని గురించి మాట్లాడలేదు. లైగర్ సమస్యలన్నీ పూరీ చుట్టే చుట్టుకున్నాయని ఫ్యాన్స్ అంటున్నారు.
లైగర్ ఫ్లాప్ వల్ల నైజాం డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్ వరంగల్ శీను, శోభన్ బాబులు పూరీపై డబ్బుల కోసం ఎక్కువ వత్తిడి చేసినట్లు తెలుస్తోంది. సుమారు రూ.8 కోట్ల వరకు పూరీ జగన్నాథ్ తమకు ఇవ్వాల్సి ఉందని ఈ ఫైనాన్షియర్లు ఇప్పటికే బెదిరింపులకు దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎవ్వరి బెదిరింపులకు భయపడేది లేదని..నెలలో ఖచ్చితంగా డబ్బు తిరిగి ఇస్తానని పూరీ చెప్పిన ఆడియో లీక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. లైగర్ ఫ్లాప్ పూరీ ఎపిసోడ్ ఇంకెక్కడికి దారితీస్తుందో వేచి చూడాలి.