Hyderabad : ప్రతీ రోజు సికింద్రాబాద్ నుంచి బేగంపేట వెళ్లే ప్రయాణికులు ఇదో పెద్ద శుభవార్త.. గత కొన్ని నెలలుగా సికింద్రాబాద్ టు బేగంపేట్ రూట్‌లో నాలా పనులు కోసం ఆ రోడ్డును బ్లాక్ చేశారు. ప్రయాణికులు రూటు మార్చుకొని బేగంపేట వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఈ నాలా పనులు పూర్తి కావడంతో ప్రయాణికులతో పాటు కంటోన్మెంట్ కాలనీ ప్రజలు ఊపిరి పీల్చుకోనున్నారు.
హైదరాబాద్‌లో వరదల నుంచి స్లమ్ ఏరియాలను పరిరక్షించడానికి సుమారు 10 కోట్ల రూపాయలతో పికెట్ నాలా పనులను ప్రారంభించింది జీహెచ్ఎంసీ. ప్రతీ ఏటా వర్షాకాలంలో కంటోన్మెంట్ పరిధిలో ఉన్న మురికివాడలు తీవ్ర ఇబ్బందులు ఎరుర్కొంటున్నాయి. ఈ నాలా రిపేర్ పనులతో కంటోన్మెంట్ పరిధిలోని 8వేల కుటుంబాలకు నాలా కష్టాలు తీరనున్నాయి.
రోజుకి కొన్ని లక్షల మంది సికింద్రాబాద్ మీదుగు బేగుంపేట నుంచి వెళ్లతుంటారు.. ఈ నాలా దగ్గరకి రాగానే వాహనాలన్నీ అక్కడికక్కడే నిలిచిపోతాయి.. అక్కడి నుంచి పెద్ద యూటర్క్ తీసుకొని జేమ్స్ స్ట్రీట్ నుంచి మళ్లీ బేగంపేట్ వైపుకు వెళ్లాల్సి వస్తుంది. దీని వల్ల పెట్రోల్‌తోపాటు ఎంతో సమయం ప్రయాణికులకు వృధా అవుతుంది. రెండు నిమిషాలు పట్టే రూట్ ఐదు నుంచి పది నిమిషాలు పడుతుంది. ఈ నాలా రిపేర్ పనులు పూర్తి కావడంతో ప్రయాణికులు ఆనందాన్ని వ్యక్తి చేస్తున్నారు.
రిపేర్ చేసి మళ్లీ కొత్తగా నిర్మించిన ఈ పికెట్ నాలాను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ రోజు ప్రారంభించనున్నారు.