Mohan Babu Case.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన మోహన్ బాబు(Mohan Babu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో ఎంతో గౌరవం అందుకున్న ఈయన.. గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో ఉన్న పరువును పోగొట్టుకున్నారని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మంచు మనోజ్(Manchu Manoj), మంచు విష్ణు(Manchu Vishnu) మధ్య ఆస్తి గొడవలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈసారి ఏకంగా మోహన్ బాబు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
నేడే మోహన్ బాబు అరెస్ట్..
జలపల్లి లో ఉన్న మోహన్ బాబు ఇంటి వద్ద జరిగిన సంఘటనలో మోహన్ బాబుకు నోటీసులు అందించారు పోలీసులు. ముఖ్యంగా ఆయన ఇంటి వద్ద ఏకంగా 70 మంది ప్రైవేట్ బౌన్సర్ ల మోహరింపు, అక్కడ జరిగిన ఘటనలో మోహన్ బాబు జర్నలిస్టులపై చేసిన దాడి, అన్నింటికీ వివరణ ఇవ్వాలని రాచకొండ పోలీసులు నోటీసులు ఇచ్చారు.అయితే ఆరోజు జరిగిన గొడవలో బీపీ డౌన్ కావడం వల్ల స్పృహ తప్పి పడిపోయిన మోహన్ బాబు…ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. విచారణకు హాజరు కాలేనని తెలిపారు. దాంతో విచారణను డిసెంబర్ 24 కు వాయిదా వేశారు. మరొకవైపు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయగా ఆ పిటిషన్ ను కూడా కోర్టు కొట్టివేసింది. ఇక నేటితో గడువు ముగియడంతో రాచకొండ పోలీసులు మరొకసారి విచారణకు రావాలని నోటీసులు పంపడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు ఎక్కడ ఉన్నారు? అని పూర్తి వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఒకవేళ నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా మోహన్ బాబు హాజరు కాకపోతే ఆయన అరెస్టు అవ్వడం ఖాయమని తెలుస్తోంది. మరి మోహన్ బాబు విచారణకు వస్తారా? లేక పోలీసులు తమ పని తాము చేసుకుపోతారా? అన్నది ఉత్కంఠ గా మారింది.
ఆస్తుల విషయంలోనే అసలు గొడవ..
జల్ పల్లి లో ఉన్న మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద జరిగిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా విద్యానికేతన్ విద్యాసంస్థలలో అవకతవకలు జరుగుతున్నాయని మంచు మనోజ్ తండ్రితో వాధించగా.. తండ్రి ప్రధాన కార్యదర్శి వినయ్ తో పాటు పలువురు రౌడీలు తనపై దాడి చేశారని పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ కంప్లైంట్ ఇచ్చారు. అయితే అదేరోజు మంచు మోహన్ బాబు కూడా తన కొడుకు మంచు మనోజ్ , కోడలు మౌనిక (Mounika) నుంచి ప్రాణహాని ఉందని వాట్సాప్ ద్వారా కంప్లైంటు పంపించారు. దీంతో ఇద్దరూ పరస్పరం కంప్లైంట్ చేసుకోవడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. ఇక దీంతో ఇంటివద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో మంచు మనోజ్ 30 మంది బౌన్సర్లను రంగంలోకి దింపగా, దుబాయ్ లో ఉన్న మంచు విష్ణు కూడా 40 మంది బౌన్సర్లను రంగంలోకి దింపారు.
జర్నలిస్టులపై దాడి..
అయితే మోహన్ బాబు ఇంటి వద్ద ఉన్న సెక్యూరిటీ అలాగే పోలీసులు తన బౌన్సర్లను లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తనకు తన కుటుంబం నుంచి ప్రాణహాని ఉందని డీజీపీ, డీజీలను కలిసి ఇంటికి వస్తుండగా మోహన్ బాబు ఇంటి ముందు సెక్యూరిటీ మంచు మనోజ్ దంపతులను లోపలకు పంపించలేదు. దాంతో గొడవ జరిగింది. మనోజ్ గేట్లు బద్దలు కొట్టుకొని ఇంట్లోకి వెళ్లిపోయారు. అదే సమయంలో మోహన్ బాబును మీడియా వారు ప్రశ్నించే ప్రయత్నం చేయగా.. మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి చేశారు. ఇక వారు మోహన్ బాబు పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు.