BigTV English

Allu Arjun Case: బన్నీ మెడకు బిగుస్తున్న ఉచ్చు.. బెయిల్ క్యాన్సిల్ చేయాలంటూ పిటిషన్..?

Allu Arjun Case: బన్నీ మెడకు బిగుస్తున్న ఉచ్చు.. బెయిల్ క్యాన్సిల్ చేయాలంటూ పిటిషన్..?

Allu Arjun Case: ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే అల్లు అర్జున్ (Allu Arjun)తెలిసి చేస్తున్నారా? తెలియక చేస్తున్నారా? అర్థం కావడంలేదని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ర్యాలీ విషయంలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే అదే రోజు ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది కోర్ట్. కానీ వెంటనే ఆయన తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయగా.. వ్యక్తిగత పూచీకత్తు పైన అలాగే రూ.50 వేల బాండ్ పైన అల్లు అర్జున్ కి నాలుగు వారాల పాటూ మధ్యంతర మాత్రమే లభించింది. ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీనే. అలాంటి ఈయన బహిరంగంగా ప్రెస్ మీట్ లు పెట్టి తాను చెప్పాలనుకున్నది ప్రజలతో చెప్పడం, దీనికి తోడు బాధిత కుటుంబానికి కొంత డబ్బు ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నామని బహిరంగంగా ప్రకటించడంతో.. అల్లు అర్జున్ పై వ్యతిరేకత నెలకొంటోంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు


ఫైర్ అయిన ఏసీపీ..

దీనికి తోడు నిన్న ఏసీపీ కూడా రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి అసలు ప్రెస్ మీట్ ఎలా పెడతారు? తప్పుచేసి తప్పించుకోవడానికి డబ్బును ఎరగా వేస్తున్నారా? అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. అంతేకాదు అల్లు అర్జున్ చట్ట విరుద్ధమైన పనులు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు సీరియస్ అయ్యారు. చట్టం దృష్టిలో అందరూ సమానమే. సినిమాలలోనే హీరోలు నిజజీవితంలో ప్రతి ఒక్కరూ పౌరులే. తప్పు చేసినవారికి శిక్ష తప్పదు.. తప్పు చేసిన వారిని సరిదిద్దడమే తమ పని అంటూ ఒక స్టెప్పు ముందుకు వేస్తున్నట్లు తెలుస్తోంది.


బెయిల్ క్యాన్సిల్ చేయాలంటూ నేడు హైకోర్టులో పిటిషన్..

అందులో భాగంగానే సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ విలేకరులతో మాట్లాడడాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి, దర్యాప్తును ప్రభావితం చేసేలా అల్లు అర్జున్ వ్యాఖ్యలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారట. ఒకవేళ ఇదే గనుక జరిగితే బన్నీ బెయిల్ కాస్త క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఆయన జైలుకు వెళ్ళబోయే పరిస్థితులు వున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అల్లు అర్జున్ తాను తవ్విన గోతిలో తానే పడ్డట్టు అవుతోందని నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.

విషాదం మిగిల్చిన పుష్ప 2 ..

అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్(Sukumar) కాంబినేషన్లో 2021 లో విడుదలైన చిత్రం ‘. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై ఊహించని సక్సెస్ అందుకుంది. దాంతో ఈ సినిమా సీక్వెల్ కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురు చూశారు. ఎట్టకేలకు డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమా విడుదల అయ్యింది. అందరూ అనుకున్నట్టుగానే విధ్వంసం సృష్టించింది. కలెక్షన్ల పరంగా సరి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఇప్పటివరకు ఏ హీరో కూడా టచ్ చేయని రేంజ్ ను అందుకున్నారు బన్నీ. అయితే ఈ సంతోషాన్ని అల్లు అర్జున్ అనుభవించలేకపోతున్నారు. కారణం సంధ్యా థియేటర్ దగ్గర రేవతి మరణం, ఆమె మరణమే ఇప్పుడు బన్నీ మెడకు బిగుసుకుంటోంది. ఏది ఏమైనా పుష్ప 2 తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్, ఈ సినిమాతోనే తన కెరీర్లో విషాదాన్ని నింపుకునే అవకాశం కనిపిస్తోందని అభిమానుల సైతం బాధపడుతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×