Pooja Hegde: సినిమా ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరు ఎప్పుడు పైకి ఎదుగుతారు.. ఎవరు ఎప్పుడు కిందికి దిగుతారు అనే విషయం ఎవరికీ తెలియదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగిన పూజా హెగ్డే ఇప్పుడు ఒక హిట్టు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ముకుంద సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత ఒక లైలా కోసం అంటూ నాగచైతన్యతో రొమాన్స్ చేసిన పూజా వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ మెప్పించింది. ఇలా వరుస సినిమాలతో పూజా హెగ్డే టాలీవుడ్ ల నెంబర్ వన్ హీరోయిన్ గా మారింది. ఒకానొక సమయంలో ఆమె చేతిలో అరడజన్ సినిమాలు ఉండేవి అంటే అతిశయోక్తి కాదు.
స్టార్ హీరోలు అందరూ పూజా హెగ్డే కోసం క్యూలు కట్టేవారు. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ సినిమాల్లో కూడా పూజా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. అయితే ఇదంతా ఒకప్పుడు అని చెప్పొచ్చు. 2021 లో పూజా హెగ్డే, అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అయ్యగారి కెరీర్ లోనే మొట్టమొదటి హిట్ గా నిలిచింది. ఇక అయ్యగారికి హిట్ ఇచ్చిన హీరోయిన్ గా పూజా హెగ్డే కు మంచి పేరు కూడా వచ్చింది. అయితే అదే ఈ చిన్నదాని లాస్ట్ హిట్ గా మారింది.
2021 నుంచి 2025 వరకు పూజా తొమ్మిది సినిమాలు చేసింది. రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్, కీసికా భాయ్ కిసికి జాన్, దేవా, రె ట్రో ఇలా స్టార్ హీరోలతోనే ఆమె కలిసి పని చేసింది. కానీ ఈ నాలుగేళ్లలో అమ్మడికి ఒక్క మంచి హిట్ అందింది లేదు. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అసలు పూజా కెరీర్ మొత్తం ఏమవుతుందో అనే అనుమానం అభిమానుల్లో కలగడం మొదలైంది.
ఇక ఇప్పుడు పూజ ఆశలన్నీ జననాయగన్ మీదనే పెట్టుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చిత్రం జననాయగన్. రాజకీయాల్లోకి పూర్తిగా వచ్చేముందు విజయ్ అభిమానులకు ఇస్తున్న లాస్ట్ గిఫ్ట్ గా జననాయగన్ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుందని సమాచారం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో తాజాగా తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసుకుంది పూజా. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ కు సిద్ధమవుతుంది. దీంతో అభిమానులు దేవుడా పూజాకు ఒక హిట్టైనా పడేలా చెయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో నైనా పూజా హెగ్డే విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.