BigTV English

Bone Cancer: ఇవన్నీ ఎముక క్యాన్సర్ లక్షణాలే.. కానీ 95 శాతం మంది వీటిని పట్టించుకోరు

Bone Cancer: ఇవన్నీ ఎముక క్యాన్సర్ లక్షణాలే.. కానీ 95 శాతం మంది వీటిని పట్టించుకోరు

ఎముక క్యాన్సర్ ప్రమాదకరమైన ప్రాణాలు తీసే వ్యాధుల్లో ఒకటి. ఇది కొన్ని లక్షణాలను ప్రారంభ దశలో చూపిస్తుంది. కానీ ఎంతో మందికి ఆ లక్షణాలపై అవగాహన లేదు. దీనివల్ల వ్యాధి ముదిరిపోయేదాకా ఎముక క్యాన్సర్ బయటపడడం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బోన్ క్యాన్సర్ లక్షణాలను తెలుసుకోవాలి.


చాలామంది బోన్ క్యాన్సర్ అనగానే నొప్పి ఎముకల్లోనే వస్తుంది అనుకుంటారు. నిజానికి బోన్ క్యాన్సర్ ఉన్న వారిలో రకరకాల అవయవాలలో నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఆ నొప్పి స్థిరంగా కొనసాగుతూ ఉన్న కండరాలపై అధిక ఒత్తిడి పడుతున్న దానికి కారణం సరైన భంగిమలో నిద్రపోకపోవడం కావచ్చు. కానీ ఆ నొప్పి బోన్ క్యాన్సర్ వంటి పెద్ద వ్యాధికి కూడా సంకేతం కావచ్చు. కాబట్టి ఎముకల భాగంలో నొప్పి తీవ్రంగా వస్తున్నా, అసౌకర్యంగా అనిపిస్తున్నా వెంటనే వైద్యులను కలిసి తగిన చికిత్సను తీసుకోవాలి.

ఎముక క్యాన్సర్ లో వచ్చే నొప్పి రాత్రి సమయంలో అధికంగా వస్తుంది. అలాగే ఏ పని చేయకుండా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది కండరాల నొప్పితో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటుంది. కండరాల నొప్పి వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకుంటే చాలు.. ఆ నొప్పి కాస్త తగ్గుముఖం పడుతుంది. కానీ ఎముకలో వచ్చే నొప్పి విపరీతంగా పెరుగుతుంది. విశ్రాంతి తీసుకున్నప్పుడు ఈ నొప్పి మరింతగా తెలుస్తుంది.


గడ్డలాంటిది తగిలితే
శరీరంలోని ఏ భాగంలో అయినా మీకు ముద్దలాంటి లేదా గడ్డ లాంటి భాగం చేతికి తగిలితే దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. చిన్న గాయం అయితే లేదా కీటకం కుడితే వాపు ఎలా వస్తుందో.. అలానే ఈ ముద్దలాంటి భాగం కూడా కనిపిస్తుంది. దానిలో నొప్పి లేకపోయినా కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎముక క్యాన్సర్ విషయానికి వస్తే చేతులు, కాళ్లు, పొత్తు కడుపు కింది భాగం ఇలా శరీర భాగాల చుట్టూ గడ్డలు లేదా వాపు వంటివి కనిపిస్తాయి. ప్రారంభంలో ఎలాంటి నొప్పి ఉండదు. కానీ కణితి పరిమాణం పెరుగుతూ ఉంటుంది. అప్పుడు నొప్పిగా అనిపిస్తుంది. దీన్ని తేలిగ్గా తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు.

ఎముకలు నీరసించడం, పగుళ్లు ఏర్పడడం అనేది ఏ వయసులోనైనా రావచ్చు. ఇది కాల్షియం లోపం వల్ల వస్తుంది. లేదా కింద పడడం వల్ల గాయం తగిలి కూడా రావచ్చు. కానీ ఎలాంటి సమస్య లేకుండా ఎముకలో పగుళ్లు పదేపదే సంభవిస్తున్నా చిన్న చిన్న గాయాలకే ఎముకలు విరుగుతున్న వెంటనే వైద్యులను కలవాలి. దీనికి శరీరంలో అభివృద్ధి చెందుతున్న ప్రమాదకరమైన వ్యాధి కారణం కావచ్చు. ఎముక క్యాన్సర్ విషయంలో కణితులు ఏర్పడి ఎముకలను బలహీనంగా మారుస్తాయి. దీనివల్ల ఎముకలు పెళుసుగా మారి చిన్న చిన్న గాయాలకు పగిలిపోతూ ఉంటాయి.

ఎముక క్యాన్సర్ లక్షణాలు
శరీరంలో తీవ్ర అలసట వస్తున్నా, చిన్న పని చేసినా ఒత్తిడి పెరుగుతున్నట్టు అనిపిస్తున్నా, నిద్ర పట్టకపోయినా, అలసట అధికంగా ఉన్నా, విశ్రాంతి తీసుకున్న కూడా అలసిపోతున్నట్టు అనిపించినా ఎముక క్యాన్సర్ ఉందేమో అని అనుమానించాల్సిందే .ఎముక క్యాన్సర్ వల్ల వచ్చే అలసట విశ్రాంతి తీసుకున్నా కూడా ఉపశమనంగా అనిపించదు. ఎందుకంటే బోన్ క్యాన్సర్ రక్త కణాలు ఉత్పత్తి అయ్యే ఎముక మజ్జను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. బోన్ క్యాన్సర్ అనేది శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల శరీరానికి శక్తి అందదు. అందుకే అలసటగా అనిపిస్తుంది .

బోన్ క్యాన్సర్ నిర్ధారణ ఇలా
ఎముక క్యాన్సర్ అనేది మొదటి ఎముకలోనే మొదలవుతుంది. తర్వాత శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. ఈ క్యాన్సర్ నిర్ధారించాలంటే ముందుగా ఎక్స్ రే తీస్తారు. తర్వాత కణితిలోని కొంత భాగాన్ని తీసి బయాప్సీ పరీక్ష చేస్తారు. అలాగే ఎమ్మారై, సిటీ స్కాన్ వంటివి కూడా చేస్తారు. చివరికి క్యాన్సర్ దశను, అది ఎంతవరకు వ్యాప్తి చెందిందో తెలుసుకుంటారు. చికిత్సలో భాగంగా అవసరమైతే ఆపరేషన్ చేయాల్సి రావచ్చు. అలాగే కీమోథెరపీ, రేడియేషన్ థెరపీని కూడా చేస్తారు. కీమోథెరపీలో క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. రేడియేషన్ ఉపయోగించి క్యాన్సర్ కణాలను చంపడం లేదా వాటి పెరుగుదలను తగ్గించడం వంటివి రేడియేషన్ థెరపీలో చేస్తారు.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×