Nara Lokesh : అమరావతి నమో నమః అంటూ సింపుల్‌గా స్పీచ్ స్టార్ట్ చేశారు నారా లోకేశ్. ఆ తర్వాత స్పీడ్ పెంచారు. పంచ్ డైలాగులతో ఇరగదీశారు. పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తేశారు. లోకేశ్ స్పీచ్ నెవ్వర్ బిఫోర్ అంటూ అన్నివర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
100 పాకిస్తాన్‌లు వచ్చినా..
పాకిస్తాన్ గీత దాటింది.. చాలా పెద్ద తప్పు చేసింది.. 100 పాకిస్తాన్‌లు వచ్చినా.. గడ్డి కూడా పీకలేరు.. ఎందుకంటే మన దగ్గర తిరుగులేని వెపన్ ఉంది.. ఆ వెపన్.. నమో మిస్సైల్.. పాకిస్తాన్ పాలిట సింహం.. మన నరేంద్ర మోదీ.. అంటూ నారా లోకేశ్ పవర్‌ఫుల్‌గా మాట్లాడారు. నమో దెబ్బకు పాకిస్తాన్‌కు దిమ్మ తిరిగడం ఖాయం.. ఇప్పటికే పాక్ ఆర్మీ అధికారులు రాజీనామాలు చేస్తున్నారని గుర్తు చేశారు.
ఏపీపై మోదీకి ప్రేమ
ఇటీవల కేంద్రం తీసుకున్న కులగణన నిర్ణయం కేవలం నిర్ణయం మాత్రమే కాదని అదో సంచలనం అన్నారు నారా లోకేశ్. ఢిల్లీలో బిజీగా ఉన్నా.. అమరావతి కోసం తరలి వచ్చారన్నారు. మోదీకి ఆంధ్రప్రదేశ్ అన్నా, అమరావతి అన్నా చాలా ప్రేమని చెప్పారు. ప్రధాని మోదీ ఏపీ కోరికలన్నీ తీరుస్తున్నారని చెప్పారు. ‘విశాఖ ఉక్కును కాపాడారు.. రైల్వే జోన్, ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్, నక్కపల్లి డ్రగ్ పార్క్ కు నిధులు కేటాయించారు.. ఇప్పుడు అమరావతిని ప్రారంభిస్తున్నారు’.. అని నారా లోకేశ్ కొనియాడారు.
ఆ దమ్ము ఎవరికీ లేదు..
అమరావతి ఎవరో ఇంట్లో పెంచుకున్న మొక్క కాదని.. మన గుండెల్లో దాచుకున్న రాజధానిని అని లోకేశ్ అన్నారు. రైతులపై ఎన్ని అరాచకాలు చేసినా.. ఇక్కడి వాళ్లు తగ్గేదేలే అన్నారని గుర్తు చేశారు. నమో శంకుస్థాపన చేసిన అమరావతిని ఆపే దమ్ము ఎవరికీ లేదని తేల్చి చెప్పారు నారా లోకేశ్.