BigTV English

Pooja Hegde: అవకాశాల కోసం అలా చేయాలి, బాలీవుడ్‌కు వెళ్లింది అందుకే.. పూజా హెగ్డే కామెంట్స్

Pooja Hegde: అవకాశాల కోసం అలా చేయాలి, బాలీవుడ్‌కు వెళ్లింది అందుకే.. పూజా హెగ్డే కామెంట్స్

Pooja Hegde: హీరోలు మాత్రమే కాదు.. హీరోయిన్లకు కూడా ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పటికీ ఇండస్ట్రీలో సెటిల్ అయిన ఎంతోమంది హీరోయిన్స్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు అందులో పూజా హెగ్డే కూడా యాడ్ అయ్యింది. ఇప్పటికే తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా తనకంటూ ఒక క్రేజ్ సంపాదించుకుంది పూజా. ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్స్ రావడంతో తన కెరీర్ కాస్త స్లో అయినా ఇప్పటికీ తన చేతిలో పలు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాంటి పూజా తాజాగా సౌత్, నార్త్ ఇండస్ట్రీల మధ్య తేడాల గురించి, నెపో కిడ్ కాకపోవడం వల్ల ఎదుర్కున్న ఇబ్బందుల గురించి ఓపెన్ కామెంట్స్ చేసింది.


వర్కవుట్ అవ్వకపోతే

‘‘నీకు ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేనప్పుడు ఆడియన్స్ నీకొక ఛాన్స్ ఇస్తారా లేదా అని ఆలోచించే ముందు అసలు ఇండస్ట్రీలో నీకొక ఛాన్స్ వస్తుందా లేదా అని ఆలోచించాలి. ప్రతీ సినిమా కీలకమే. ప్రతీ అవకాశం కీలకమే. ఎందుకంటే నా ప్రతీ సినిమాను నిర్మిస్తూ నీకు మరొక సినిమా అవకాశం కూడా ఇస్తాను అని చెప్పేవారు నాకు లేరు. అలా అని ప్రతీ సినిమా హిట్ అవుతుందని కాదు. హిట్ అయితే మరొక అవకాశం వస్తుంది. హిట్ కాకపోతే ఒక్కసారి అది కెరీర్‌కు బ్రేక్ పడేలా కూడా చేస్తుంది. ఏదైనా వర్కవుట్ అవ్వకపోతే తరువాతి ప్రాజెక్ట్ కోసం మనల్ని మనం మార్చుకోవాలి. నేనెప్పుడూ నా పనిని చిన్నచూపు చూడను’’ అంటూ చెప్పుకొచ్చింది పూజా హెగ్డే (Pooja Hegde).


బాలీవుడ్‌పై కన్ను

ఇక సౌత్‌లో హీరోయిన్స్‌గా అడుగుపెట్టిన తర్వాత వెంటనే బాలీవుడ్ వైపు ఆశగా ఎదురుచూసే హీరోయిన్స్ కూడా చాలామంది ఉన్నారు. పూజా హెగ్డే కూడా అదే చేసింది. తను మోడలింగ్ చేస్తున్నప్పుడే హీరోయిన్‌గా తెలుగు, తమిళ సినిమా అవకాశాలు తనను వెతుక్కుంటూ వెళ్లాయి. అలా సౌత్‌లో డెబ్యూ ఇవ్వగానే వెంటనే బాలీవుడ్ నుండి తనకు ఛాన్స్ వచ్చింది. కానీ అక్కడ తన డెబ్యూ అంతగా సక్సెస్ అవ్వలేదు. అయినా నిరాశ చెందకుండా సౌత్‌లో సినిమా చేస్తూ బాలీవుడ్‌లో అవకాశాలు కోసం ప్రయత్నించింది. అలా బీ టౌన్‌లో పలువురు స్టార్ హీరోలతో నటించింది. సౌత్‌లో వెలిగిపోతుండగా బాలీవుడ్‌కు వెళ్లడానికి కారణమేంటో తాజాగా బయటపెట్టింది పూజా.

Also Read: యంగ్ హీరోతో రొమాన్స్ చేయనున్న కీర్తి.. కొత్త ప్రయోగాలకు రెడీ అంటున్న మహానటి

అవి చూస్తూనే పెరిగాను

‘‘బాలీవుడ్‌లో ఎదగాలని ఎవరికి ఉండదు.? ఒక్క సినిమా అవకాశం వల్ల మన జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవ్వరం చెప్పలేం. నేను చిన్నప్పటి నుండి బాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరిగాను. వాటితో నాకు డీప్ కనెక్షన్ ఉంది. మంచి సినిమాలు చేస్తుంది అని పేరు తెచ్చుకోవడమే నా గోల్. అది ఏ భాషలో అయినా సరే’’ అంటూ తన కోరికను బయటపెట్టింది పూజా హెగ్డే. సౌత్‌లో తన యాక్టింగ్‌తో ఎంతమంది అభిమానులను సంపాదించుకుందో.. అంతే ఎక్కువ ట్రోలింగ్‌కు కూడా గురయ్యింది ఈ ముద్దుగుమ్మ. తనకు అసలు యాక్టింగే రాదని, కేవలం గ్లామర్‌తోనే ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఉందని పూజా హెగ్డేపై ఇప్పటికీ తన హేటర్స్ కామెంట్స్ చేస్తూనే ఉంటారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×