BigTV English
Advertisement

Korean Salt: ఈ ఉప్పు కిలో రూ.30 వేలు.. అంత ప్రత్యేకత ఏమిటో!

Korean Salt: ఈ ఉప్పు కిలో రూ.30 వేలు.. అంత ప్రత్యేకత ఏమిటో!

ఉప్పు చాలా చవకైన పదార్థం కిలో కావాలంటే 20 రూపాయలకే వచ్చేస్తుంది. నెల అంతా ఆ 20 రూపాయల ప్యాకెట్ సరిపోతుంది. అంత చవకైన ఉప్పును మనము వాడతాము. అయితే ప్రపంచంలోనే అతి ఖరీదైన ఉప్పు కూడా ఉంది. దీని కొనాలంటే ఒక కిలోకి 30 వేల రూపాయలు ఖర్చు పెట్టాలి. దీని పేరు కొరియన్ బాంబూ సాల్ట్.


ఉప్పులో రకాలు

అనేక రకాల ఉప్పులు మార్కెట్లో ఉన్నాయి. తెల్ల ఉప్పు, నల్ల ఉప్పు, రాతి ఉప్పు, ఊరగాయపు ఉప్పు, పింక్ సాల్టు ఇలా ఎన్నో రకాలు వీటి ధరలన్నీ కూడా సాధారణంగానే ఉంటాయి. కానీ కొరియన్ బాంబూ సాల్ట్ ధర మాత్రం చాలా ఎక్కువ. దీన్ని తయారు చేయడం కూడా కాస్త కష్టమైన ప్రక్రియగానే ఉంటుంది. అందుకే దీని ధర అధికంగా ఉంటుంది.


వెదురు కర్రను ఉపయోగించి ఈ ఉప్పును అత్యంత ప్రత్యేకమైన పద్ధతిలో తయారు చేస్తారు. ఈ ఉప్పు తయారీలో అనేక దశలు ఉంటాయి. వీటన్నింటినీ దాటాకే ఉప్పు బయటికి వస్తుంది. అందుకే దీని ధర కూడా అధికంగా నిర్ణయించారు. ఖరీదైన కొరియన్ బాంబూ సాల్ట్ తయారు చేయడానికి 45 నుండి 50 రోజుల సమయం పడుతుంది. దీన్ని జుగ్యోమ్ అని కూడా పిలుస్తారు.

ఉప్పు తయారీ ఇలా

కొరియన్‌లా ప్రసిద్ధ ఉప్పు ఇది. వారు ఔషధ ప్రయోజనాల కోసం ఎక్కువగా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అలా వారు వెదురును ఉపయోగించి ఉప్పును సృష్టించారు. ఈ ప్రత్యేక ఉప్పును తయారు చేయడం కోసం బోలుగా ఉండే వెదురు గొట్టాలను తీసుకుంటారు. అందులో సముద్రపు ఉప్పును నింపి చివరలో మూసివేస్తారు. ఆ వెదురు గొట్టాలను అధికమంటపై కాలుస్తారు. వెదురు నుండి వచ్చే ఖనిజాలన్నీ ఉప్పులోకి చేరిపోతాయి.

ఆ వెదురును ఎనిమిది వందల నుండి 1500 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్న ఉష్ణోగ్రత వద్ద కాలుస్తారు. అధిక వేడి కారణంగా ఉప్పు చల్లబడిపోయి ద్రవ రూపంలోకి మారిపోతుంది. ఇలా తొమ్మిది సార్లు కాల్చే ప్రక్రియను పునరావృతం చేస్తూ ఉంటారు. అందుకే ఈ ఉప్పు ఉత్పత్తి కావడానికి చాలా సమయం పడుతుంది.

వెదురు ఉప్పులో ఉండే పోషకాలు

కొరియన్ వెదురు ఉప్పులో పొటాషియం, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. కానీ సాధారణ సముద్ర ఉప్పుతో పాటు మిగతా ఉప్పులో ఇలాంటి పోషకాలు ఏవీ ఉండవు. కాబట్టే కొరియన్ వెదురు ఉప్పు ఎంతో ఆరోగ్యకరమైనది. ఖనిజాల కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టే ఈ కొరియన్ వెదురు ఉప్పు అధికంగా కొరియన్లు అమ్ముతూ ఉంటారు. అయితే ధనవంతులు మాత్రమే వీటిని కొనడం వాడడం వంటివి చేస్తారు.

Related News

Mumbai Style Vada Pav: ముంబై స్టైల్ వడా పావ్ రెసిపీ.. క్షణాల్లోనే రెడీ చేసుకోవచ్చు !

Jilebi Sweet Recipe:జ్యూసీ, క్రిస్పీ జిలేబీ.. ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు !

Ice Cubes For Burnt Pans: ఐస్ క్యూబ్స్ ఇలా వాడితే చాలు.. ఎంత మాడిన పాత్రలైనా కొత్తవాటిలా మెరుస్తాయ్

Qualities in Boys: అబ్బాయిల్లో ఈ లక్షణాలు ఉంటే.. అమ్మాయిలు ఫిదా అయిపోతారట!

Maida Side Effects: ఆరోగ్యంగా ఉండాలా ? అయితే.. ఈ పిండితో చేసిన వంటకాలు తినడం మానేయండి

Loneliness: జగమంత కుటుంబం ఉన్నా.. ఒంటరి అన్న భావనలో మునిగిపోయారా?

Almond Milk:బాదం పాలు తాగితే.. మతిపోయే లాభాలు తెలుసా ?

Sweet Potato: 30 రోజుల పాటు.. చిలగడదుంప తింటే ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×