BigTV English

Poonam Kaur: దర్శకుడు త్రివిక్రమ్ ‌పై సినీ నటి పూనం కౌర్ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Poonam Kaur:  దర్శకుడు త్రివిక్రమ్ ‌పై సినీ నటి పూనం కౌర్ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Poonam Kaur Sensational Comments Trivikram: సినీ నటి పూనమ్‌కౌర్ ఒకప్పుడు టాలీవుడ్ పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా వివాదాలతోనే ప్రేక్షకులను పలకరిస్తోంది. నిరంతరం సినిమా పరిశ్రమలో కొంతమంది వ్యక్తులపై ఆమె ఆరోపణలు చేస్తూ వస్తుంది. తాజాగా, మరోసారి ఆమె ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


పూనమ్‌కౌర్ ప్రతి విషయంపై తన అభిప్రాయాన్ని డైరెక్ట్‌గా చెప్పేస్తుంది. ప్రధానంగా టాలీవుడ్ పరిశ్రమలో ప్రముఖులైన ఇద్దరిపై ట్వీట్‌లు చేస్తుంటుంది. అయితే ఎప్పుడూ వారి పేర్లను ప్రస్తావించకుండా కామెంట్ చేసే ఈ బ్యూటీ.. ఇప్పుడు నేరుగా తన అభిప్రాయాన్ని పంచుకుంది.

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై పూనం విరుచుకుపడింది. ఇటీవల తెలుగు యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు చిన్న పిల్లలు, అమ్మాయిల విషయంలో అసభ్యకర కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలతో అతడిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు.


అయితే ఆడపిల్లలపై ఇలాంటి వ్యాఖ్యలు కొత్తేమి కాదని, ఇంతకుముందు కూడా తెలుగు హీరోలు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరిగింది. ఇందులో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జల్సా సినిమాపై కూడా ప్రస్తావన వచ్చింది.

జల్సా సినిమాలో బ్రహ్మానందంతో పవన్ కల్యాణ్ మాట్లాడుతున్న సీన్లలో ఓ డైలాగ్ పై చర్చ జరిగింది. ఆ డైలాగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హీరో సాయిధరమ్ తేజ్ ఇలాంటి విషయాలపై కూడా స్పందించాలంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నే నటి పూనమ్ కౌర్ కామెంట్ చేసింది.

‘త్రివిక్రమ్ నుంచి ఇంతకన్నా మంచి డైలాగ్స్ ఆశించడం తప్పే అవుతుంది’ అని తెలిపింది. అయితే ఒక నెటిజన్ రియాక్ట్ అయ్యాడు. ‘మీ వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉంటే సోషల్ మీడియాలో వ్యక్తపరచకండి. త్రివిక్రమ్ టాలెంట్ ఏంటో అందరికీ తెలుసు’ అని కామెంట్ పెట్టాడు.

Also Read: కమల్ హాసన్ కన్నా ముందు సేనాపతిగా ఏ టాలీవుడ్ హీరోను అనుకున్నారో తెలుసా.. ?

నెటిజన్ కామెంట్‌కు పూనమ్ కౌర్ కౌంటర్ ఇచ్చింది. ‘త్రివిక్రమ్ ఎలాంటి వాడో, ఆయన చెడు స్వభావం ఏంటో నాకు తెలుసు. మగవారి ఇగోకోసం ఆయన సపోర్ట్ చేస్తారని కూడా తెలుసు. నువ్వు నీ అనుభవంతో మాట్లాడుతుంటే..నేను నా అనుభవంతో మాట్లాడుతున్నాను. ఇతరుల జీవితాలను త్రివిక్రమ్ నాశనం చేస్తారు.’ అని పూనమ్ ఘాటుగా స్పందించింది.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×