BigTV English

Poonam Kaur: పవన్ మూడు పెళ్లిళ్లు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పూనమ్

Poonam Kaur: పవన్ మూడు పెళ్లిళ్లు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పూనమ్

Poonam Kaur: మాయజాలం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ పూనమ్ కౌర్. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కానీ కొన్ని సినిమాలకే పూనమ్ పరిమితమయ్యింది. సినిమాలకన్నా పూనమ్ వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యింది. పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాలో పార్వతి మెల్టన్ పాత్ర ఆమె చేయాల్సి ఉందని, త్రివిక్రమ్ తనను ఆ పాత్ర చేయకుండా చేశాడని ఆరోపించింది. ఆ తర్వాత పవన్ తనను మోసం చేశాడని, తాము విడిపోవడానికి త్రివిక్రమ్ కారణం అని కూడా చెప్పుకొచ్చింది.


ఇక ఈ ఆరోపణలను రాజకీయ పార్టీలు పెద్దవిగా చేసి పవన్ పై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న పూనమ్ సందు దొరికినప్పుడల్లా త్రివిక్రమ్ పై మండిపడుతూనే ఉంటుంది. ఈమధ్య కూడా త్రివిక్రమ్ ను.. గురూజీ పేరుతో సోషల్ మీడియాలో ఎన్నో విమర్శలను చేసింది. ఇక అలాంటి పూనమ్ మొట్టమొదటిసారి పవన్ కు సపోర్ట్ గా నిలబడింది. ఒక వైసీపీ నేత చేసిన విమర్శలను ఒక్క మాటతో తిప్పికొట్టింది. వివరాల్లోకి వెళితే. సోషల్ మీడియాలో ఎన్నారై వైసీపీ నేత ప్రదీప్ రెడ్డి చింత.. గత కొన్నిరోజులుగా జనసేనను, టీడీపీ ను టార్గెట్ గా చేసి పోస్టులు చేస్తూ ఉన్నాడు.

ఇక ఈరోజు కూడా టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్ ను ట్యాగ్ చేస్తూ.. ఏపీలో టెస్లా కంపెనీ పెట్టాలనుకుంటున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా త్వరలోనే ఏపీ.. టెస్లా కంపెనీని ఇన్వైట్ చేసిన పోస్ట్ ను కూడా షేర్ చేశాడు. ఇక ఈ పోస్ట్ కు సమాధానంగా పూనమ్ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఆయనకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి.. అది మీకేం ప్రాబ్లెమ్ కాదా అని అడిగేసింది. మొదటి నుంచి వైసీపీ నేతలు.. మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం ఎలా అవుతాడు అంటూ విమర్శిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వారందరికీ కలిపి పూనమ్ సింగిల్ గా సమాధానం ఇచ్చి షాక్ ఇచ్చింది. ఇక ఈ ట్వీట్ చూసిన పవన్ ఫ్యాన్స్ .. ఏది ఇప్పుడు అనండి .. పవన్ మూడు పెళ్లిళ్లు అని కామెంట్స్ పెడుతున్నారు.  ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ కౌంటర్ పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.


 

Related News

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Ester Valerie Noronha : రెండో పెళ్లి చేసుకుంటున్న నోయల్ మాజీ భార్య ఎస్తేర్.. ఇతడితో ఎన్ని రోజులుంటుందో..?

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Big Stories

×