Nandamuri Mokshagna : గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నట వారసుడు మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) టాలీవుడ్ ఎంట్రీ గురించి చాలా కాలం నుంచి అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటిదాకా మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి సంబంధించి ఒక్క అప్డేట్ కూడా రాకపోవడం నందమూరి ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేస్తోంది. అప్పుడెప్పుడే ఒక్క పోస్టర్ ను వదిలారు. ఆ తరువాత అప్డేట్ ఊసే లేదు. నేపథ్యంలోనే తాజాగా మోక్షజ్ఞ కొత్త లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ లుక్ చూసాక మోక్షజ్ఞ ఇలా మారిపోయాడు ఏంటి? అంటూ నిరాశను వ్యక్తం చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.
మారిపోయిన నందమూరి వారసుడు
తాజాగా బాలయ్యకు పద్మభూషణ్ (Padmabhushan) వచ్చిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), ఆయన సతీమణి భువనేశ్వరి (Bhuvaneswari) సపరేట్ గా ఫ్యామిలీ పార్టీ అరేంజ్ చేసి, బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు నారా, నందమూరి కుటుంబాలతో పాటు ప్రముఖులు కూడా విచ్చేశారు.. అలాగే నందమూరి మోక్షజ్ఞ కూడా అక్కడికి వచ్చాడు. ఆ టైంలో తీసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ప్రశాంత్ వర్మ (Prashanth Varma) మోక్షజ్ఞను లాంచ్ చేయబోతున్నాడు అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రిలీజ్ చేసిన పోస్టర్లో మోక్షజ్ఞ సన్నగా కనిపించాడు. కానీ తాజాగా నారా ఫ్యామిలీ ఇచ్చిన పార్టీలో తన తండ్రితో కలిసి మోక్షజ్ఞ దిగిన పిక్ చూస్తుంటే, ఆయన కాస్త లావైనట్టుగా కనిపిస్తున్నాడు. పైగా అంతకు ముందు ప్రశాంత్ వర్మ రిలీజ్ చేసిన పిక్స్ లో లాగా హ్యాండ్సన్ గా కాకుండా, మోక్షజ్ఞ సాధారణంగా కనిపించడంతో అయోమయంలో పడ్డారు నందమూరి అభిమానులు.
నందమూరి వారసుడి కోసం బాలీవుడ్ ప్రిన్సెస్
నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ గురించి గత కొన్ని నెలల నుంచి వరుసగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ లాంచ్ కు రంగం సిద్ధమైందని బాలయ్య అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అంతేకాకుండా ఆ తర్వాత మోక్షజ్ఞ స్టైలిష్ ఫోటోలు రిలీజ్ కావడంతో నందమూరి నట వారసుడు సినిమాకు సంబంధించిన లుక్ తో రెడీగా ఉన్నాడని, యాక్షన్ లోకి దిగడానికి ఎక్కువ టైమ్ లేదని నందమూరి ఫ్యాన్స్ కి క్లారిటీ వచ్చేసింది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. అలాగే ఈ సినిమాలో మోక్షజ్ఞ సరసన హీరోయిన్ గా నటింప చేయడానికి చాలామంది హీరోయిన్లను టెస్టులు చేశారని అంటున్నారు. శ్రీలీలతో పాటు చాలామంది పేర్లు తెరపైకి రాగా, చివరకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూతురును సెలెక్ట్ చేశారని టాక్ నడుస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ మోక్షజ్ఞకు జంటగా నటించబోతుందని అంటున్నారు. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు.