BigTV English
Advertisement

Posani Krishna Murali: చిరంజీవి ఏడ్చి మొత్తుకుంటే ఆపాను.. పవన్ కళ్యాణ్ ఏం పీకావ్ నువ్వు..

Posani Krishna Murali: చిరంజీవి ఏడ్చి మొత్తుకుంటే ఆపాను.. పవన్ కళ్యాణ్  ఏం పీకావ్ నువ్వు..

Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళీ.. నటుడు, నిర్మాత , రచయిత, డైరెక్టర్, డైలాగ్ రైటర్ గా ఎన్నో మంచి సినిమాలకు పని చేశాడు. కామెడీ అయినా, విలనిజం అయినా.. పోసాని అద్భుతంగా నటిస్తాడు.  ఇక ఇక్కడవరకు ఒకే కానీ,  ఒక రాజకీయ నాయకుడిగా ఆయన పెట్టిన ప్రెస్ మీట్లు ఇండస్ట్రీలో పెను సంచలనాలను  సృష్టించాయి. ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు పోసాని మాట్లాడిన వ్యాఖ్యలు ఏ రేంజ్ లో చిచ్చుపెట్టాయా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


నిజం చెప్పాలంటే.. నటి పూనమ్ కౌర్ ను మోసం చేసింది, అబార్షన్ చేయించి.. ఆమె జీవితాన్ని నాశనం చేయించింది పవన్ కళ్యాణ్ అనే విషయాన్నీ మీడియా ముందు నిర్మొహమాటంగా చెప్పిన వ్యక్తి పోసాని. ఆ తరువాత  పవన్ తల్లిని, వదినను అప్పటి రాజకీయ నేతలు.. ఇష్టానుసారం తిట్టిన విషయం కూడా విదితమే. ఆ సమయంలో పోసాని.. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఫ్యాన్స్ అందరూ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై దాడి కూడా చేయించారు. ఇక అప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిన పోసాని.. ఆ తరువాత అప్పుడప్పుడు బయట కనిపిస్తున్నాడు.

ఇక ఈ మధ్యనే  తిరుపతి లడ్డూ వివాదంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పోసాని.. తాజాగా  కొండా సురేఖ వివాదంలో తలదూర్చాడు.  మంత్రి కొండా సురేఖ.. అక్కినేని కుటుంబం గురించి, సామ్ – చై  విడాకుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఇక సమంతను, అక్కినేని కుటుంబాన్ని అనడంతో ఇండస్ట్రీ మొత్తం వారికి సపోర్ట్ గా నిలబడింది.


కొండా సురేఖ అన్న మాటలను ఇండస్ట్రీ అంతా ఖండించింది. అయితే కొంతమంది మాత్రం.. అక్కినేని కుటుంబం, సమంత అనగానే లేచిన నోర్లు.. ఒకప్పుడు పవన్ కళ్యాణ్  తల్లిని, చెల్లిని, భార్యను  నీచాతి నీచంగా మాట్లాడినప్పుడు  లేవలేదేంటి.. ? అని ప్రశ్నిస్తున్నారు. ఇక దీనికి పోసాని సమాధానమిచ్చాడు.

” చిరంజీవి కుటుంబాన్ని వాళ్లు తిడుతుంటే.. పవన్ కళ్యాణ్ ఒక్క ముక్క మాట్లాడలేదు. నా వదినను అంటారా.. ? నా అక్కను అంటారా.. ? నా తల్లిని అంటారా.. ? అని మాట్లాడలేదు.  ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇప్పుడు అంటున్నారే.. అప్పట్లో నోర్లు ఎక్కడ లేచాయి. ఖండించాలి కదా .. అని. నాగార్జునను అంటే ఇంతమంది అడుగుతున్నారే.. చిరంజీవిని అన్నప్పుడు మిగతా  హీరోలను పక్కన పెట్టు.. సొంత తమ్ముడు పవన్ ఎందుకు ఖండించలేదు. మా అన్నను తిడతారా.. ? అని పవన్, నాగబాబు రోడ్డు మీదకు వచ్చారా.. ?. రాలేదు.  చాలా చాల టైమ్ వేచి చూసిన చిరంజీవి.. నాకు కాల్ చేశాడు.

చిరంజీవి నాకేమైనా అన్నా.. ?  బ్లడ్ రిలేషనా.. ? ఏది కాదు. పోసాని అంటే ఒక గౌరవం. హంబుల్ గా ఉంటాడు. బాగా చదువుకున్నవాడు. ఆయనకు ఇంతపెద్ద రాజకీయంలో.. ఇంత పెద్ద కులంలో  నేను తప్ప ఇంకెవరు కనిపించలేదు. చిరంజీవి ఫోన్ చేసి ఏడ్చాడు.. మురళీ.. నా భార్య, పిల్లలు  ఏం చేశారు అని అడిగే సరికి నేను కూడా ఏడ్చాను.  ఒక లెజండరీ నటుడు.. వాళ్ళింట్లో ఆడవాళ్లను తిడతాడా.. ? అన్నయ్య.. మీరు బాధపడకండి. నేను మాట్లాడతా అని ఫోన్ పెట్టి.. వెంటనే  ప్రెస్ మీట్ పెట్టి.. ఎవరైతే తిట్టారో వారికి బుద్ధిచెప్పి క్షమాపణలు చెప్పించాను.

మరి ఇప్పుడు  పవన్ కళ్యాణ్ ఏం పీకుతున్నాడు. నువ్వే వచ్చి మొదట నిలబడాలి. ఎవడ్రా నా కొడుకు మా కుటుంబాన్ని అన్నది అనాలి.. కానీ మాట్లాడలేదు.  నేనే తిట్టారని చెప్పారు.  ఇప్పుడు చెప్తున్నా పవన్ కళ్యాణ్ అమ్మగారిని నేను తిట్టలేదు. అలా తిట్టినట్లు ఒక్క క్లిప్పింగ్ చూపిస్తే.. ఇదే లైవ్ లో గుంతుకోసుకొని చచ్చిపోతా.. ” అంటూ మాట్లాడాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×