BigTV English

CM Chandrababu: తన రికార్డ్ తనే తిరగరాసిన సీఎం చంద్రబాబు.. 10 సార్లు పైగానే శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ

CM Chandrababu: తన రికార్డ్ తనే తిరగరాసిన సీఎం చంద్రబాబు.. 10 సార్లు పైగానే శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ

CM Chandrababu: ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మరో రికార్డు సృష్టించనున్నారు. ఇప్పటివరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరై.. స్వామివారికి పట్టు వస్త్రాలు అధిక సార్లు సమర్పించిన సీఎంగా చంద్రబాబు చరిత్ర కెక్కనున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో ప్రభుత్వం తరఫున.. సీఎం హోదాలో ఉన్న నేత పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ అనంతరం.. శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా.. నేడు సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలను స్వామి వారికి సమర్పించనున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లను సైతం పూర్తి చేశారు.


ఏడాదికి ఒకసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. ఈ బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుండే కాక దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటారు. అంతేకాకుండా విదేశీయులు సైతం శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొనడాన్ని.. పుణ్యకార్యంగా భావిస్తారు. అందుకే ఈ ఏడాది కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఈవో శ్యామల రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Also Read: Tirumala: తిరుమల బ్రహ్మోత్సవాలకు ముందు అపశృతి.. టీటీడీ అలర్ట్..


కాగా శ్రీవారికి ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీ 1978 నుండి ప్రారంభమైందని తెలుస్తోంది. తొలిసారిగా శ్రీవారికి నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి, స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం కొన్నేళ్లు స్వామివారికి పట్టు వస్త్రాలను ఆలయ అధికారులే సమర్పించగా, 1984లో ముఖ్యమంత్రిగా ఉన్న నందమూరి తారక రామారావు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీని పునః ప్రారంభించారు. ఇలా చంద్రబాబు సైతం సీఎం హోదాలో 2003లో పట్టు వస్త్రాలు సమర్పించేందుకు తిరుమలకు వెళుతున్న క్రమంలో అలిపిరి వద్ద జరిగిన బాంబు పేలుళ్ల నుండి అదృష్టవశాత్తు బయటపడ్డారు. తనకు తిరుమలేశుడు పునర్జన్మ ఇచ్చినట్లు బాబు నాడు ప్రకటించారు.

ఇలా తమ ఇంటి ఇలవేల్పుగా తిరుమల శ్రీ శ్రీనివాసుడిని సీఎం చంద్రబాబు పూజిస్తారు. తాజాగా జరిగిన ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం చంద్రబాబు తిరుమల పర్యటనకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే తన పరిపాలన ప్రక్షాళన తిరుమల నుండే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 1995 లో నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం 1999-2004, 2014-19 సంవత్సరాలలో సీఎంగా గల బాబు.. ఆ పదేళ్ళ కాలంలో స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తాజా గెలుపుతో నాల్గవసారి సీఎంగా గెలుపు అందుకున్న చంద్రబాబు.. ప్రస్తుతం జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇప్పటికి పది సార్లకు పైగా.. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎంగా చంద్రబాబుకు రికార్డు సొంతమైందని చెప్పవచ్చు.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×