BigTV English

Tollywood Heroes : వాళ్లు బానే ఉన్నారు… మనమే బాగుండాలి

Tollywood Heroes : వాళ్లు బానే ఉన్నారు… మనమే బాగుండాలి

Tollywood Heroes : ఏ రంగంలోనైనా పోటీ ఉండటం అనేది సహజంగానే జరుగుతుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ విషయానికి వస్తే ప్రతి సీజన్ కి పోటాపోటీగా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా సంక్రాంతి సీజన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మామూలు సీజన్‌లో కంటే కూడా సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయ్యే సినిమాల రెవిన్యూ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పాలి. అందుకే ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రతి సంక్రాంతికి తన బ్యానర్ నుంచి ఒక సినిమా ఉండేలా ప్లాన్ చేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు అంతా పాన్ ఇండియా లెవెల్ లో ఆలోచిస్తున్నారు. కానీ ఒకప్పుడు మాత్రం తెలుగు హీరోల్లోనే పోటాపోటీగా ఉండేది. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద విపరీతంగా తలపడేవి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వీరి మధ్య ఉన్న పోటీ మరో హీరోల మధ్య పెద్దగా ఉండేది కాదు.


ఇక రీసెంట్ టైమ్స్ లో మల్టీ స్టారర్ సినిమాలు రావటం వలన ఈ పోటీ కాస్త తగ్గింది. అయితే ప్రస్తుతం ఫ్యాన్ వార్స్ విపరీతంగా జరుగుతూ ఉంటాయి. ఒకరిపై ఒకరు ట్రోల్స్ కూడా విపరీతంగా చేసుకుంటారు. సినిమాలు గురించి కలెక్షన్ గురించి మాట్లాడితే పరవాలేదు గానీ ఫ్యామిలీ విషయాలు కూడా ట్విట్టర్ వేదిక ప్రస్తావన తీసుకొస్తుంటారు కొంతమంది. చాలాసార్లు కొంతమంది హీరోలు మేం బాగానే ఉంటాము మీరు బాగుండాలి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు జనతా గ్యారేజ్ సినిమా ఈవెంట్ కు హాజరైనప్పుడు “మేము మేము బాగానే ఉంటాము.. మీరే ఇంకా బాగుండాలి” అని చెప్పినప్పుడు చాలామంది అప్రిషియేట్ చేశారు. అంతేకాకుండా బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ షో గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ షోలో వచ్చిన గెస్ట్ లతో బాలయ్య ఫోన్ కాల్ మాట్లాడించడంతో తెలుగు హీరోలు ఎంత క్లోజ్ గా ఉంటారు అని అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. ముఖ్యంగా రామ్ చరణ్, ప్రభాస్ మధ్య ఫ్రెండ్షిప్ కూడా బయటపడింది.

ఈ షో తర్వాత విశ్వక్సేన్, సిద్దు జొన్నలగడ్డ వంటి హీరోలు బాలకృష్ణతో ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టారు. ఇక బాలకృష్ణ కూడా మాట్లాడుతూ రామ్ చరణ్ తో చిరంజీవితో ఉన్న అనుబంధం గురించి పలుమార్లు చెబుతూ వచ్చారు. ఇకపోతే ఈ సంక్రాంతికి వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం, చరణ్ గేమ్ చేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్ రిలీజవుతున్నాయి. ఈ తరుణంలో ఏపీలోని యడ్లపాడులో స్టార్ హీరోల సినిమాల పేర్లతో ఏర్పాటు చేసిన ఓ పోస్టర్ ఆకట్టుకుంటోంది. బాలకృష్ణ, రాంచరణ్, వెంకటేశ్ తాజాగా నటించిన సినిమా పేర్లతో కొందరు అభిమానులు పోస్టర్ ఏర్పాటు చేశారు. ఆ పోస్టర్లో “మేం మేం బానే ఉంటాం.. మీరే ఇంకా బాగుండాలి” అని సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×