trinayani serial today Episode: డెడ్ బాడీని చూపించమని నయని అడగ్గానే విక్రాంత్ వద్దని చెప్తాడు. దీంతో గురువు నయని చెప్పినట్టే అందరూ నడుచుకోండని చెప్తాడు. విక్రాంత్ షాక్ అవుతాడు. ఇంతలో మీరు మా వెంట నడిస్తే మాకు నమ్మకం వస్తుందని తిలొత్తమ్మ చెప్తుంది. అలాగే కానీ ఆ దేహాన్ని చూపించేది నేను కాదు అంటాడు గురువు. ఎవరు చూపిస్తారని వల్లభ అడగ్గానే.. గాయత్రి చూపిస్తుందని చెప్తాడు గురువు. స్వామి గాయత్రి పాపనా..? అంటూ అనుమానం వ్యక్తం చేస్తుంది నయని. అవునని తనకైతే ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసంటాడు గురువు. దీంతో తిలొత్తమ్మ.. నిర్జీవంగా ఉండే దేహాన్ని చూపించు గాయత్రి అని అడుగుతుంది.
నయని చంకలోంచి దిగిన గాయత్రి ఇంట్లోకి వెళ్తుంది. మమ్మీ గాయత్రి వెళ్తుంది మనం వెళ్దాం పద అంటాడు వల్లభ. నయని, విక్రాంత్, దురందర తప్ప మిగతా వారందరూ గాయత్రి వెనకాల వెళ్తారు. వాళ్లు వెళ్లాక నయని టెన్షన్‌గా అటూ ఇటూ తిరుగుతుంది. ఇప్పుడు చేతులు నొక్కేసుకుంటూ.. వేళ్లను విరిసేసుకుంటూ ఉంటే లాభం లేదు నయని.. అంటుంది దురందర. నయని అసహనంగా అబ్బా నన్ను ఆలోచించుకోనివ్వండి పిన్ని అంటుంది. అంత టైం మనకు ఎక్కడుంది అంటుంది దురందర. ఇంతలో అక్కడికి విక్రాంత్ వస్తాడు. అత్తయ్యా వదినను నువ్వు టెన్షన్ పెట్టకు.. అంటాడు.
దీంతో ఇంకెక్కడి వదిన అయ్యా వాళ్లు వెళ్లి ఇల్లంతా చెక్ చేస్తున్నారు. పైగా కన్నకూతురే ముందుండి తీసుకెళ్తుంది అంటుంది దురందర. గాయత్రి వెళ్లడం.. గురువు గారు కూడా మా అమ్మవాళ్ల మాట విని రావడం.. నాకు ఆశ్చర్యంగానే ఉంది అంటాడు విక్రాంత్. ఇప్పుడు అవాక్కవడానికి కూడా సమయం లేదు కదా అంటుంది దురందర. మరి ఇప్పుడు ఏం చేయమంటావు అత్తయ్యా..వదిన బాడీని బయటకు తీసుకెళితే అందరి ముందు మనమే బయట పెట్టినట్టు అవుతుంది అని విక్రాంత్ చెప్పగానే.. పోనీ ఇంకెక్కడైనా దాచిపెడితే.. అంటుంది దురందర. ఉన్నచోటు నుంచి ఇంకో చోటికి మార్చే టైం ఎక్కడుంది అత్తయ్యా అంటాడు విక్రాంత్.
ఇంతలో నయని, విక్రాంత్ బాబు స్వామిజీ మనల్ని ఇరికించడానికి రాలేదు. మనకు సాయం చేయడానికే వచ్చారనిపిస్తుంది అని చెప్పగానే.. ఇంతలా కంగారుపడుతుంటే నీకు కనికరం చూపించినట్టు ఉందా.? తల్లి అంటుంది దురందర. ఈ తల్లిని కాపాడటానికే గాయత్రి పాప వాళ్లను తీసుకుని వెళ్లింది పిన్ని.. అనగానే..నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్తం అయితే నాకు చెంపదెబ్బ కొట్టు అంటుంది దురందర. ఇంతలో విక్రాంత్.. అత్తయ్యా నువ్వు ఉండు.. వదిన మీకు గురువు గారు ఏమైనా చెప్పారా..? అని అడుగుతాడు. లేదు కానీ గాయత్రిని తీసుకుని వెళ్లారు అంటే ఈ పాటికి నేరుగా నా దేహం ఉన్నచోటికే వెళ్లి ఉండాలి అంటుంది నయని.
అవును అలా వెళ్లలేదు. ఇళ్లంతా రౌండ్లు తిరుగుతున్నారు అంటుంది దురందర. కరెక్టు నేను అనుకున్నది నిజమే..అంటుంది నయని. ఏం అనుకుంటున్నావు నయని మాక్కూడా కాస్త చెబితే నీకు హెల్ప్ చేస్తాము కదా..? అంటుంది దురందర. కచ్చితంగా చేయాలి పిన్ని. నేను వెంటనే వెళ్లి చీర మార్చుకుని వస్తాను. నేను వచ్చేలోపు మీరు ఇద్దరూ వెళ్లి కోమాలో ఉన్న నా దేహాన్ని మార్చేయండి. ఈ లోపు నేను వచ్చి కోమాలో ఉన్నట్టు నటిస్తాను. అని నయని చెప్పగానే సరేనని విక్రాంత్, దురందర వెళ్తారు.
మరోవైపు ఇళ్లంతా తిప్పిన గాయత్రి పాప ఒక రూంలోకి తీసుకెళ్తుంది. గాయత్రి వెనక వెళ్లిన వాళ్లందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. హాసిని ఏముందమ్మా అక్కడ అని అడుగుతుంది. అమ్మా అని గాయత్రి చెప్తుంది. అమ్మా మీ అమ్మా హాల్ లో ఉంది కదా అంటుంది సుమన. ఇంతలో పక్కనే ఉన్న దుప్పటి ఒకటి తెరచి షాక్ అవుతాడు వల్లభ. వల్లభ సౌండ్‌కు ఏమైందని విక్రాంత్ పరుగెత్తుకొస్తాడు. నయని బాడీని చూసిన హాసిని ఇక్కడ పడుకుందేంటి మా అక్క అని అడుగుతుంది. పడుకోలేదని కన్ను మూసిందని తిలొత్తమ్మ చెప్తుంది. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్ ఏపిసోడ్ కు ఎండ్ కార్డు పడుతుంది.