BigTV English

Prabahs: డార్లింగ్ లైఫ్ పై డాక్యుమెంటరీ… నిర్మాతలకు ప్రభాస్ షాకింగ్ రూల్

Prabahs: డార్లింగ్ లైఫ్ పై డాక్యుమెంటరీ… నిర్మాతలకు ప్రభాస్ షాకింగ్ రూల్

Prabahs : ప్రభాస్ ఇప్పుడు ఇండియాలోనే తిరుగులేని హీరో అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పేరు వింటే బాలీవుడ్ నిద్దట్లో కూడా భయపడుతుంది. అలా ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అని చెప్పుకునే హిందీ చిత్ర పరిశ్రమకు కూడా తన రికార్డులతో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు రెబల్ స్టార్. ఒక్కో సినిమాతో ఒక్కో టార్గెట్ ను ఫిక్స్ చేస్తూ, హీరో అంటే ఇలా ఉండాలి అనిపిస్తున్నాడు. ప్రభాస్ ఇటీవల కాలంలో జెట్ స్పీడ్ తో వరుస సినిమాలు చేస్తూ అదే రేంజ్ లో అప్డేట్స్ ఇస్తూ అభిమానులను ఖుషి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ పై డాక్యుమెంటరీకి సన్నాహాలు మొదలయ్యాయని తెలుస్తోంది.


డార్లింగ్ పై డాక్యుమెంటరీ

డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో తిరుగులేని హీరోగా నిలవడానికి వెనుక ఆయన పడిన కష్టం, కృషి కచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా ఆయన ఎన్నో రిజెక్షన్స్, అవమానాలు ఎదుర్కొని, సమస్యలను తట్టుకొని ఈ స్థాయికి చేరుకుని ఉంటారు. కానీ ప్రభాస్ పర్సనల్ లైఫ్ గురించి జనాలకు పెద్దగా తెలియదు కాబట్టి వాటి గురించి తెలిసే ఛాన్స్ లేదు. దీని గురించి తెలుసుకోవాలని అభిమానులు కూడా అనుకుంటారు. ఒకవేళ ప్రభాస్ పర్సనల్ లైఫ్ తెరపైకి వస్తే అది ఎంతోమందికి ఆదర్శంగా నిలిచే ఛాన్స్ ఉంటుంది. అందుకే జీ5 అనే ఓటీటీలో రెబల్ స్టార్ ప్రభాస్ మీద డాక్యుమెంటరీ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు మొదలు కాగా, ప్రభాస్ సొంత ఊరు మొగల్తూరుకు వెళ్లి అక్కడ గ్రామస్తులతో పాటు ప్రభాస్ తో కలిసి సినిమాలు చేసిన నటీనటులు, దర్శకులు, ఫ్రెండ్స్.. ఇలా ఇండస్ట్రీలో ఆయనతో ఎవరెవరు క్లోజ్ గా ఉంటారో వారితో వీడియోలు తీయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రభాస్ ఈ డాక్యుమెంటరీ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వచ్చే ఏడాది దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. అయితే ప్రభాస్ నిర్మాతలకు ఒక కండిషన్ పెట్టారట. కానీ అది డాక్యుమెంటరీ కోసం కాదు ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాల కోసం.


దర్శక నిర్మాతలకు ప్రభాస్ కండిషన్

ప్రస్తుతం ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలను వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. అభిమానులను డిసప్పాయింట్ చేసే విషయం కూడా ఇదే. కనీసం ప్రభాస్ ని ఏడాదికి రెండుసార్లైనా తెరపై చూస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. అందుకే ప్రభాస్ కూడా ఫుల్ జోష్ పెంచి వరుసగా సినిమాలను లైన్లో పెట్టారు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న సినిమాలను శర వేగంగా పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇకపై 90 రోజుల్లోనే సినిమాలకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేయాలని దర్శక నిర్మాతలకు ఆయన స్ట్రిక్ట్ కండిషన్ పెట్టినట్టుగా టాక్ నడుస్తోంది. ఇలాగైతేనే ఏడాదికి రెండు సినిమాలు చేసి అభిమానులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోగలరని ప్రభాస్ భావిస్తున్నారట. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమాని చేస్తున్నారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×