BigTV English

Salman Khan : సల్లూ భాయ్ మాత్రమే కాదు… డేంజర్‌‌ జోన్‌లో ఉన్న బీ టౌన్ స్టార్స్ వీళ్లే

Salman Khan : సల్లూ భాయ్ మాత్రమే కాదు… డేంజర్‌‌ జోన్‌లో ఉన్న బీ టౌన్ స్టార్స్ వీళ్లే

Salman Khan : ఎన్సిపి నాయకుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ శనివారం రాత్రి దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చి చంపిన నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముంబైలో సల్మాన్ ఖాన్ ఉండే బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్మెంట్ బయట దాదాపు 15 మంది పోలీసులు ప్రస్తుతం పహారా కాస్తున్నారు. అయితే ఇప్పుడు సల్మాన్ ఖాన్ మాత్రమే కాదు ఈ వివాదం వల్ల పలువురు బీ టౌన్ స్టార్స్ కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. మరి వారు ఎవరెవరు? వాళ్లకు ఉన్న డేంజర్ ఏంటి? అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.


డేంజర్ జోన్ లో ఉన్న బీ టౌన్ స్టార్స్

2024 ఏప్రిల్ లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల ఘటన కలకలం రేపింది. తమ ఆరాధ్య జంతువు కృష్ణ జంకను సల్మాన్ ఖాన్ చంపడంతో ఆయనపై పగబట్టారు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్. తమకు వ్యక్తిగతంగా ఎవరితో శత్రుత్వం లేదు అని చెబుతూనే ఎవరైనా సల్మాన్ ఖాన్ కు సహాయం చేస్తే వాళ్ల పని పడతామంటూ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. ఇక అన్నట్టుగానే సల్మాన్ ఖాన్ కు అత్యంత ఆప్తుడైన సిద్ధిఖీని తాజాగా అంతమొందించారు. బాబా సిద్ధిఖీ హత్యకు గత కొన్ని నెలల నుంచి రెక్కి నిర్వహించినట్టుగా పోలీసులు తెలిపారు. సిద్ధిఖీ హత్య నేపథ్యంలో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద భారీగా భద్రతను పెంచారు. అలాగే సల్మాన్ ఖాన్ కు మహారాష్ట్ర వై ప్లస్ కేటగిరీ భద్రతను ప్రభుత్వం కల్పిస్తోంది. అయితే ఒక్కసారి గమనిస్తే ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉన్నది కేవలం సల్మాన్ ఖాన్ మాత్రమే కాదు. ఆయన చుట్టూ ఉన్న సెలబ్రిటీలు కూడా. కానీ ప్రభుత్వ మాత్రం సల్మాన్ ఖాన్ తో పాటు ఆయన సన్నిహితులు, బంధువులకు ముంబైలో సెక్యూరిటీని టైట్ చేశారు.


పనిలో పనిగా ఎవరైనా ఈ సెలబ్రిటీ ఏరియాలో ఉండే ఇతర సెలబ్రిటీలపై దాడి చేస్తే పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ముంబైలో బాంద్రా అనే ఏరియాలో చాలామంది సెలబ్రిటీలు నివాసం ఉంటున్నారు. అదొక అత్యంత లగ్జరీ సెలబ్రిటీ ఏరియా అని చెప్పొచ్చు. సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే ప్రతి ఒక్కరూ అక్కడ సొంత ఇంటినీ కొనాలని కలలుగంటారు. ఇలా ఇప్పటికే బాంద్రాలో సల్మాన్ ఖాన్ ఉంటున్న ఇంటికి చుట్టుపక్కలే షారుఖ్ ఖాన్, జాకి ష్రాఫ్, ఆదిత్య పంచోలి, జీనత్ అమన్, నటి రేఖ, సోహెల్ ఖాన్ వంటి బాలీవుడ్ సెలబ్రిటీలు ఉన్నారు. సల్మాన్ ఖాన్ వల్ల ఈ సెలబ్రిటీలు కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టేనని సదరు సెలబ్రిటీల అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

వివాదం ఏంటంటే…

1998 కృష్ణ జింక కేసులో సల్మాన్ ఖాన్ చిక్కుకున్నప్పటి నుంచి బిష్ణోయ్ గ్యాంగ్ అతన్ని టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే ఎన్నోసార్లు చంపుతామని బెదిరించారు. ఇక ఈ ఏడాది మొదట్లో ఆయన ఇంటి దగ్గర చోటు చేసుకున్న కాల్పుల ఘటన సంగతి గుర్తుండే ఉంటుంది.. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్సిపి సీనియర్ నేత, బాంద్రా మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీని దారుణంగా హత్య చేశారు. శనివారం రోజు బాంద్రాలోనే దసరా సంబరాల నేపథ్యంలో ముగ్గురు దుండగులు తుపాకులతో ఆయనను కాల్చి చంపారు. ఈ ఘటన ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర ఉన్న సెలబ్రిటీగా గుండెల్లో గుబులు పుట్టించక మానదు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×