BigTV English

Prabhas : అభిమాని కోసం సినిమాలకు ప్రభాస్ దూరం.. ఇది అస్సలు ఊహించలేదు డార్లింగ్..

Prabhas : అభిమాని కోసం సినిమాలకు ప్రభాస్ దూరం.. ఇది అస్సలు ఊహించలేదు డార్లింగ్..

Prabhas : స్టార్ హీరో ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఈయన సినిమా లైనప్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవుద్ది. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో నాలుగు ఐదు సినిమాలు లైన్ లో పెట్టుకుంటాడు. అయితే అన్ని సినిమాలు ఫ్యాన్ ఇండియా లెవెల్ లో ఉండడంతో ఆయన సినిమాలు థియేటర్లలో రావడానికి కాస్త ఆలస్యంగా అవుతుంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ మూవీలో నటిస్తున్నాడు. ఆ మూవీని ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ మూవీ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. అయితే కొన్ని కారణాలతో ఈ మూవీ పోస్ట్ పోన్ అయ్యినట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్ చేస్తున్న ఓ పనే కారణం అని ప్రచారం జరుగుతుంది.


ప్రభాస్ సినిమాలు.. 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత వరుసగా సినిమాలను చేస్తున్నారు. బాహుబలి ఇచ్చినంత రేంజ్ లో సక్సెస్ ని మొదట్లో కొన్ని సినిమాలు ఇవ్వలేదు. సలార్ మూవీతో ప్రభాస్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాని రెండు పాటలుగా రిలీజ్ చేయబోతున్నారు మొదటి రెండో పార్ట్ ను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్ళానున్నారు. గతేడాది కల్కి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హీట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు ప్రభాస్. ఈ ఏడాది రాజా సాబ్  సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుస్తున్నారు. కానీ ఆ మూవీ రిలీజ్ వాయిదా పడుతుందని ఓ వార్త ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తుంది.. మూవీ వాయిదా పడటానికి ఓ కారణం ఉందని తెలుస్తుంది.


అభిమాని కోసం ప్రభాస్ త్యాగం..? 

రెబల్ స్టార్ ప్రభాస్ ఎప్పుడు వరుసగా సినిమాలను లైనప్ లో పెట్టుకుంటూ ఉంటాడు. సినిమా సెట్స్ మీద ఉండగానే మరో నాలుగైదు సినిమాలను ఆయన చేతిలో పెట్టుకుంటాడు. ప్రభాస్ చేతిలో అన్ని సినిమాలు ఉన్నా కూడా ఏడాదికి ఒక్క సినిమాతో మాత్రమే ప్రేక్షకులను పలకరిస్తాడు. ఇలా ఎందుకు జరుగుతుంది అని ఫ్యాన్స్ డౌట్ పడుతున్నారు. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం అరడజన్ సినిమాలు ఉన్నాయి అయితే ఈ ఏడాది రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నారని తెలిసిందే. అయితే ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుందని మరో వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇలా చేతులు సినిమాలు ఉండగానే ఏడాదికి ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయకపోవడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ప్రభాస్ సినిమాలకు డేట్స్ సరిగ్గా ఇవ్వడం లేదని ఇచ్చిన డేట్స్ ని అయినా వాడుకోవట్లేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం ఆయన వీరాభిమాని అయిన ఒక వ్యక్తిని హీరోని చేయాలని ప్రభాస్ ఆరాటపడుతున్నాడు. అతని కోసం విదేశాలకు వెళ్ళబోతున్నాడని సమాచారం. వరుస సినిమాలను అనౌన్స్ చేసి ఇప్పుడేమో అభిమాని కోసం టైం ఇవ్వాలని అనుకోవడం ప్రభాస్ చేస్తున్న తప్పు అని ఆయన ఫ్యాన్సీ సైతం సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అభిమాని సినిమాలో ఎదగాలని అనుకోవడంలో తప్పులేదు అలాగని మన ఎదుగుదలని ఆపుకొని చేయడం భావ్యం కాదు అని సలహాలు ఇస్తున్నారు.. ప్రభాస్ ను ఏడాదికి రెండు మూడు సినిమాల్లో చూడాలని అనుకున్నాం. కానీ ఇలా సినిమాలను వదిలేసి చెయ్యడం భాదగా ఉందని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో రాజా సాబ్ కాకుండా, ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 సినిమాలు ఉన్నాయి. వీటన్నికి డేట్స్ ఇచ్చాడు. కానీ ఇలా అభిమానికి ఇచ్చిన మాట కోసం అని ఆలస్యం చెయ్యడం ఏంటని ఇండస్ట్రీ లో చర్చలు మొదలయ్యాయి.. మరి ప్రభాస్ వీటి పై ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి..

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×