Pat Cummins: ఆస్ట్రేలియా ప్రస్తుత కెప్టెన్, హైదరాబాద్ సారధి ప్యాట్ కమిన్స్ ( Pat Cummins )… అదిరిపోయే శుభవార్త అందించారు. ఈ ఆస్ట్రేలియా క్రికెటర్ ప్యాట్ కమిన్స్ ( Pat Cummins ) రెండవసారి తండ్రి అయ్యాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన కూడా చేశాడు ప్యాట్ కమిన్స్ ( Pat Cummins ). ఆస్ట్రేలియా క్రికెటర్ ప్యాట్ కమిన్స్ ( Pat Cummins ) దంపతులకు…ఆస్ట్రేలియాలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో పండంటి ఆడబిడ్డ పుట్టింది. నిన్న రాత్రి సరిగ్గా 10 గంటలకు… ప్యాట్ కమిన్స్ ( Pat Cummins ) భార్య.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
Also Read: Champions Trophy 2025: పాకిస్థాన్ కొత్త జెర్సీపై ట్రోలింగ్..మున్సిపాలిటీ డ్రెస్ లా ఉందటూ ?
ఇప్పటికే ప్యాట్ కమిన్స్ ( Pat Cummins ) దంపతులకు ఒక కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పండంటి ఆడబిడ్డ పుట్టింది. ఇక ప్యాట్ కమిన్స్ కూతురు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు… ప్యాట్ కమిన్స్ తన కుమార్తెకు EDI అనే నామకరణం కూడా చేశాడు. ఇది ఇలా ఉండగా…. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ( Pat Cummins )… ప్రస్తుతం క్రికెట్ కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అతని గాయం తిరగబడడంతో… ప్రస్తుతం క్రికెట్ ఆడటం లేదు ప్యాట్ కమిన్స్.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 డిసెంబర్ లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే… ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ( Pat Cummins )కు తీవ్ర గాయం అయింది. ఆ గాయం పెద్దది కాదని అందరు భావించారు. దీంతో… ఆ గాయంతోనే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొత్తం మ్యాచులు ఆడాడు ప్యాట్ కమిన్స్. కానీ ఇప్పుడు అదే గాయం… ఆస్ట్రేలియా కొంపముంచింది. శ్రీలంతో టెస్ట్ సిరీస్ అలాగే… ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కూడా ఆడటం లేదట ప్యాట్ కమిన్స్ ( Pat Cummins ).
ఇప్పటికే పాత గాయం కారణంగా… శ్రీలంతో టెస్ట్ సిరీస్ కు దూరం అయ్యాడు. ఇక అటు… ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కు కూడా దూరం కాబోతున్నాడని అంటున్నారు. అయితే.. దీనిపై ఇంకా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటన చేయలేదు. గాయం నుంచి ప్యాట్ కమిన్స్ కోలుకుంటే… ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 Tournament ) ఆడే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పట్లో ఆ గాయం తగ్గేలా లేదని సమాచారం. అందుకే… శ్రీలంతో టెస్ట్ సిరీస్ నుంచి ప్యాట్ కమిన్స్ ను తప్పించారు. దీంతో శ్రీలంతో టెస్ట్ సిరీస్ కు ఆస్ట్రేలియా కెప్టెన్ గా స్టీవ్ స్మిత్ వ్యవహరిస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 Tournament ) మరో 10 రోజుల్లోనే ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19 వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్..మార్చి 9 వరకు జరుగనుంది. అటు… ప్యాట్ కమిన్స్ ( Pat Cummins ) గాయం కారణంగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ కూ భయపడుతోంది. ఐపీఎల్ 2025 కు కూడా కమిన్స్ దూరం అయితే.. ఎలా అనే దానిపై కూడా హైదరాబాద్ ప్రత్యామ్నాయాలు చూస్తోంది.
Also Read: Team India: కుంభమేళాలో అఘోరల క్రికెట్.. రోహిత్, కోహ్లీల మధ్య చిచ్చు ?
Pat Cummins and his wife have been blessed with a baby girl and named 'Edi'.
– Many Congratulations to both of them. ❤️ pic.twitter.com/UqPQxK1oO9
— Tanuj Singh (@ImTanujSingh) February 8, 2025