E-Paper
Advertisement

Prabhas Fans Celebration : నెవర్ బిఫోర్ రేంజ్ లో సెలబ్రేషన్స్ .. తగ్గేదే లేదంటున్న డార్లింగ్ ఫాన్స్..

Prabhas Fans Celebration : నెవర్ బిఫోర్ రేంజ్ లో సెలబ్రేషన్స్ .. తగ్గేదే లేదంటున్న డార్లింగ్ ఫాన్స్..
Advertisement
Prabhas Fans Celebration

Prabhas Fans Celebration : ప్రభాస్ అభిమానులకు ఈరోజు నిజంగానే అన్ని పండుగలు కలిసి వచ్చినట్లుగా ఉంది. ఎక్కడ చూసినా సలార్ ఫీవర్ తో పాటు ప్రభాస్ అభిమానుల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. మామూలుగా సూపర్ డూపర్ సినిమాలు వచ్చినప్పుడు థియేటర్ వద్ద భారీ కటౌట్లు పెట్టడం.. గజమాలలు వేయడం.. పాలాభిషేకాలు.. డీజే బ్యాండ్లు.. ఇలా మనం ఎన్నో చూస్తాము. అయితే డార్లింగ్ ఫాన్స్ కాస్త దీనికి భిన్నంగా కొత్త ట్రెండ్ ని సెట్ చేస్తున్నారు. ప్రభాస్ మూవీ అంటే సెలబ్రేషన్స్ వేరే లెవెల్ లో ఉంటాయి అని చెప్పకనే చెబుతున్నారు డార్లింగ్ అభిమానులు.

గత కొంతకాలంగా అందరిని ఊరిస్తున్న ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబో లో సలార్ మూవీ పార్ట్ 1 సీస్ ఫైల్ ఆడియన్స్ ముందుకు రానే వచ్చింది. ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం మంచి పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తోంది.పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్, జగపతిబాబు, ఈశ్వరి రావ్ ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా ఎటువంటి పరిస్థితుల్లో మారుతారు అనే  కాన్సెప్ట్ తో ముందుకు సాగే స్టోరీ ఇది. అంతేకాదు తన మిత్రుడి ప్రాణాల మీదకు వచ్చినప్పుడు హీరో ఏ రేంజ్ లో విజృంభిస్తాడో కూడా ఈ మూవీలో చూడవచ్చు.

Advertisement

కే జి ఎఫ్ తెచ్చిన హ్యూజ్ సక్సెస్ తరువాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న మూవీ కావడం.. అందులోనూ ప్రభాస్ హీరో కావడంతో ఏ మూవీకి మొదటి నుంచి భారీ హైప్ క్రియేట్ అయి ఉంది. పైగా చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్స్ ,సాంగ్స్ మూవీ పై ఆసక్తిని బాగా పెంచాయి. దీంతో ఈ సినిమాని మొదటి రోజే చూడడానికి చాలామంది ఆసక్తి కనబరిచారు. ఇక ప్రభాస్ అభిమానులైతే మూవీ రిలీజ్ సెలబ్రేషన్స్ ని కనీ విని ఎరుగని రీతిలో చాలా అట్టహాసంగా జరిపారు. ముఖ్యంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర రెబల్ స్టార్ అభిమానులు చేసిన సందడి అందరిని ఆకట్టుకుంది.

ఇంతకీ వాళ్ళు ఏం చేశారో తెలుసా.. ఒక మ్యూజికల్ కాన్సెప్ట్ జరిగేటప్పుడు ఎటువంటి హంగులు ఆర్భాటాలు ఉంటాయో అచ్చం అలాగే అన్ని సిద్ధం లైటింగ్స్, హోర్డింగ్స్, సౌండ్ సిస్టం.. ఇలా ప్రతి ఒక్కటి ఎంతో పర్ఫెక్ట్ గా రెడీ చేసి గురువారం రాత్రి నుంచి ప్రీమియం షో పడేంత వరకు మినీ మ్యూజికల్ కాన్సెంట్ నే నడిపారు. ఈ కాన్సర్ట్ లో ప్రభాస్ పాటలతో తెగ సందడి చేశారు అతని అభిమానులు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు వైల్డ్ ఫైర్ల నేషనల్ వైడ్ స్ప్రెడ్ అయిపోయాయి. ఒక మూవీ రిలీజ్ సెలబ్రేషన్స్ ని ఇలా కూడా చేయొచ్చా..? అని ఈ వీడియో చూసిన అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి ప్రభాస్ ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×