BigTV English

Punjagutta Fire Accident : పంజాగుట్టలో భారీ అగ్ని ప్రమాదం.. పోలీసులే హీరోలు

Punjagutta Fire Accident : పంజాగుట్టలో భారీ అగ్ని ప్రమాదం.. పోలీసులే హీరోలు

Punjagutta Fire Accident : పంజాగుట్ట ఎర్రమంజిల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగో అంతస్తు నుంచి మంటలు ఎగిసిపడుతునట్టు సమాచారం. అందులో నివసిస్తున్న కొంతమంది ప్రాణభయంతో బయటికి వచ్చి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమచారం ఇచ్చి అరగంటైనా ఫైరింజన్ అధికారులు రాలేదు.


పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఫైర్ ఈ ఘటన చోటు చేసుకోవడంతో పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పంజాగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ డంబెళ్ళతో కిటికీలను పగలగొట్టి మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించారు. ఈ ఘటనలో పంజాగుట్ట లా అండ్ ఆర్డర్ పోలీసులు దశరథ రామ్ రెడ్డి, సత్యనారాయణ అనే కానిస్టేబుల్స్ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బాధితులను రెస్క్యూ చేశారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పోలీస్ అధికారులను అభినదించారు.

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాగా.. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా ? లేదా గ్యాస్ సిలిండర్ లీక్ అవడం వల్ల ప్రమాదం జరిగిందా ? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags

Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×