Prabhas Fauji:..హను రాఘవపూడి (Hanu Raghavapudi) , ప్రభాస్ (Prabhas ) కాంబోలో రాబోతున్న తాజా మూవీ ఫౌజీ(Fauji)..ఈ సినిమా ఇప్పటికే చిత్రీకరణ జరుపుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా హను రాఘవపూడి ఒక కొత్త అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా నటించని, నటనతో ఎలాంటి అనుభవం లేని ఇమాన్వి ఇస్మాయిల్(Imanvi Ismail) కి ఈ సినిమాలో చోటు ఇచ్చారు. అలాగే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కూడా ఉంటుందని తెలుస్తోంది. అయితే టాలీవుడ్ సినీ వర్గాల నుండి వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఒక హాలీవుడ్ యాక్టర్ నటించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.మరి ఇంతకీ ఫౌజీ మూవీలో నటించే ఆ హాలీవుడ్ యాక్టర్ ఎవరో? ఇప్పుడు చూద్దాం..
రజాకార్ ఎపిసోడ్.. రంగంలోకి హాలీవుడ్ నటుడు..
హను రాఘవపూడి ఫౌజీ సినిమా 1940లో జరిగిన ప్రపంచ యుద్ధం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ బ్రాహ్మణుడైన సైనికుడి పాత్రలో కనిపిస్తారు. అయితే తాజాగా ఈ సినిమాలో.. తెలంగాణలోని రజాకార్ ఎపిసోడ్ ని కూడా తెరకెక్కిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో నిజాం నిరంకుశత్వ పాలన అని, రజాకారులని తరిమికొట్టే తెలంగాణ సాయుధ పోరాటం.. ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచింది.అయితే అలాంటి రజాకారులని తరిమికొట్టిన ఈ ఉద్యమాన్ని ఫౌజీ సినిమాలో ఒక ప్రధాన ఘట్టంగా డైరెక్టర్ చూపించబోతున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ రజాకర్ ఎపిసోడ్ ని డైరెక్టర్ మార్చిలో షూటింగ్ చేయబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కోసం సెట్ వేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ రజాకర్ ఎపిసోడ్ కోసం డైరెక్టర్ హనూ రాఘవపూడి ఒక హాలీవుడ్ యాక్టర్ ని తీసుకోబోతున్నట్టు సినీ వర్గాల నుండి టాక్ వినిపిస్తోంది.అయితే ఆ హాలీవుడ్ యాక్టర్ పేరు బయటికి వినిపించకపోయినప్పటికీ దాదాపు ఆరు నెలల నుండి ఆ హాలీవుడ్ యాక్టర్ రజాకార్ ఎపిసోడ్ కోసం మేకోవర్ చేసుకుంటున్నట్టు సమాచారం.
మరో హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టిన డైరెక్టర్..
ఏది ఏమైనప్పటికీ ప్రభాస్ – హను రాఘవపూడి కాంబోలో వస్తున్న ఫౌజీ మూవీపై ప్రతిక్షణం ఏదో ఒక అప్డేట్ ఇస్తూ సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నారు. ఇక హను రాఘవపూడి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. అలాగే ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher) తో పాటు బ్రిటిష్ వాళ్లతో జరిగే కొన్ని సన్నివేశాలలో బ్రిటిష్ యువరాణిగా బాలీవుడ్ నటి అలియా భట్ (Alia Bhatt) నటిస్తున్నట్టు ఈ మధ్యకాలంలో వార్తలు వినిపించాయి. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని డైరెక్టర్ చాలా భారీగా ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో మరో హీరోయిన్ ని కూడా తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కనిపించే హీరోయిన్ కోసం ఇప్పటికే చాలామందిని సంప్రదించినట్టు తెలుస్తోంది. కానీ మలయాళ నటి నమిత ప్రమోద్ పేరు మాత్రం ఎక్కువగా వినిపిస్తోంది. అలా విడుదలకు ముందే ఫౌజీ సినిమాపై ఎన్నో అంచనాలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా కి రజాకర్ ఎపిసోడ్ కీలకం కావడం సినిమాకి మరింత ప్లస్ అవుతుంది.