BigTV English

Aus vs ENG: బ్యాటింగ్‌ చేయనున్న ఇంగ్లాండ్‌…డేంజర్‌ ప్లేయర్లు లేకుండానే ఆసీస్‌ !

Aus vs ENG: బ్యాటింగ్‌ చేయనున్న ఇంగ్లాండ్‌…డేంజర్‌ ప్లేయర్లు లేకుండానే ఆసీస్‌ !

Aus vs ENG:  ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో ( ICC Champions Trophy, 2025 ) భాగంగా… ప్రస్తుతం ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ ( Australia vs England ) మధ్య నాలుగో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లాహోర్ లోని ( Lahore ) గడాఫీ స్టేడియంలో ( Gaddafi Stadium) నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ మ్యాచ్‌ లో మొదట టాస్‌ నెగ్గిన కంగారులు…బౌలింగ్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. మొదట బ్యాటింగ్‌ చేయనుంది ఇంగ్లాండ్‌ టీం.


Also Read: Pakistan – Champions Trophy 2025: రేపటి మ్యాచ్‌ లో పాకిస్థానే గెలవాలి.. టీమిండియా మాజీ ప్లేయర్‌ సంచలనం!

ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్‌ భారత కాలమానం ప్రకారం… 2:30 గంటలకు ప్రారంభం కానుంది. టాస్‌ ప్రక్రియ 2 గంటలకు జరిగింది. ఇక రాత్రి 10 గంటల వరకు ఈ మ్యాచ్‌ కొనసాగే ఛాన్సులు ఉంటాయి. ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్‌ ను స్టార్‌ స్పోర్ట్స్‌, న్యూస్‌ 18 లేదా జియో హాట్‌స్టార్‌లో చూడవచ్చు. జియో హాట్‌స్టార్‌లో రిచార్జ్‌ చేసుకుని చూడాల్సి ఉంటుంది. జియో, హాట్‌స్టార్‌ కలిసిన తరుణంలోనే.. ఈ రూల్స్‌ పెట్టారు.


ఇది ఇలా ఉండగా… వన్డే ఫార్మాట్లో… ఈ రెండు జట్ల మధ్య చాలా మ్యాచులు జరిగాయి. అందులో కూడా ఆస్ట్రేలియా పై చేయి సాధించడం జరిగింది. ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇప్పటివరకు 160 మ్యాచ్ లు జరిగాయి. ఈ మ్యాచ్లో ఏకంగా 90 విజయం సాధించింది ఆస్ట్రేలియా టీం. అంటే దాదాపుగా 70% విజయాలను… ఇంగ్లాండ్ పై నమోదు చేసుకుంది ఆస్ట్రేలియా టీం. అటు.. ఆస్ట్రేలియా పైన కేవలం 65 మ్యాచ్లోనే ఇంగ్లాండ్ విజయం సాధించింది.

ఇంగ్లాండ్ అలాగే ఆస్ట్రేలియా రెండు టీంలు బలంగానే ఉంటాయి. కానీ… ఎక్కువ విజయాలు ఆస్ట్రేలియా నమోదు చేసుకోవడం గమనార్హం. ఈ లెక్కల ప్రకారం.. ఇవాళ జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియా హాట్ ఫేవరెట్ గా ఉంటుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. అటు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కంటే ముందు… టీమిండియా పై వన్డే సిరీస్ కోల్పోయింది ఇంగ్లాండ్. ఆ వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత నేరుగా ఈ ఛాంపియన్ ట్రోఫీ ఆడుతోంది. అటు ఆస్ట్రేలియా కూడా కీలక ప్లేయర్లు లేకుండా బరిలోకి దిగుతోంది. మరి ఈ రెండు పరిణామాల నేపథ్యంలో ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడాలి.

Also Read: Haris Rauf On Indian Team: దుబాయ్‌ లో చిత్తుగా ఓడిస్తాం.. టీమిండియాకు పాక్‌ బౌలర్‌ హెచ్చరికలు !

ఇరు జట్ల వివరాలు

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్( C), మార్నస్ లాబుస్చాగ్నే, జోష్ ఇంగ్లిస్(w), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్

ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జామీ స్మిత్(w), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(c), లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×