BigTV English

Prabhas: చెల్లెళ్లతో ప్రభాస్.. ఆ బాండింగ్ చూడు డార్లింగ్..

Prabhas: చెల్లెళ్లతో ప్రభాస్.. ఆ బాండింగ్ చూడు డార్లింగ్..

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. కల్కి, రాజాసాబ్, స్పిరిట్, సలార్ 2.. ఇవి కాకుండా బాలీవుడ్ సినిమా ఒకటి చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ సినిమాల గురించి పక్కన పెడితే.. డార్లింగ్ చాలా ఇంట్రోవర్ట్. బయట ఎక్కడా ఎక్కువ మాట్లాడాడు. అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో అయితే రెండు మూడు ముక్కలు కంటే ఎక్కువ మాట్లాడిన దాఖలాలు కూడా లేవు.


డార్లింగ్ కు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ చాలా తక్కువ. ఎంతో రేర్ గా మాట్లాడతాడు. కానీ, తన దగ్గరవాళ్ళతో కానీ, కుటుంబంతో కానీ ఎంతో క్లోజ్ గా ఉంటాడు. ఇదుగో ఈ వీడియోలో డార్లింగ్ తన చెల్లెళ్ళతో ఎలా అల్లరి చేస్తున్నాడో చూడండి. ప్రభాస్ తో ఉన్న ఈ ముగ్గురు అమ్మాయిలు.. రెబల్ స్టార్ కృష్ణంరాజు ముద్దుల తనయలు. వారే.. సాయి ప్రసీద, సాయి ప్రదీప్తి, సాయి ప్రకీర్తి. ఈ ముగ్గురు అక్కాచెలెళ్లు ప్రస్తుతం వారి వారి కెరీర్ లో బిజీగా ఉన్నారు.

పెద్ద అమ్మాయి సాయి ప్రసీద నిర్మాణ రంగంలో మెళుకువలు నేర్చుకుంటుంది. మిగిలిన ఇద్దరు చదువు మీద దదృష్టి పెట్టారు. చిన్నతనం నుంచి వీరికి అన్న ప్రభాస్ తో ఉండడం అంటే బాగా ఇష్టం. డార్లింగ్ సైతం చెల్లెళ్లతో గడపడాన్నీ బాగా ఎంజాయ్ చేస్తాడు. ఇక పెదనాన్న కృష్ణంరాజు చనిపోయినదగ్గరనుంచి వారికి అన్న అయినా, తండ్రి అయినా ప్రభాసే అయ్యి వారిని చూసుకుంటున్నాడు.


తాజాగా ఈ ముగ్గురు.. కల్కి సెట్ లో సందడి చేశారు. ఈ మధ్యనే భైరవ ఆంథెమ్ కు సంబంధించిన షూట్ జరిగింది. ఆ సెట్ లో సాయి ప్రసీద, సాయి ప్రదీప్తి, సాయి ప్రకీర్తి తో డార్లింగ్ భల్లే భల్లే స్టెప్స్ వేశాడు. వీరితో పటు పంజాబీ సింగర్ దల్జీత్ కూడా ఉన్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ అన్నాచెల్లెళ్లు ఎప్పుడు ఇలాగే కలిసిమెలసి ఉండాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×