Bollywood:సాధారణంగా సెలబ్రిటీలందరూ కూడా మొదట తమ ప్రేమ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచి, అనూహ్యంగా పెళ్లి చేసుకొని, అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఇప్పటికే బాలీవుడ్ లో స్టార్ జోడీలుగా గుర్తింపు తెచ్చుకున్న దీపిక (Deepika Padukone) – రణవీర్ సింగ్ (Ranveer Singh), అనుష్క శర్మ(Anushka Sharma) – విరాట్ కోహ్లీ(Virat Kohli), ఆథియా శెట్టి (Athia shetty)- కేఎల్ రాహుల్(K.L.Rahul ) వంటి ఎంతోమంది సెలబ్రిటీలు మొదట తమ ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచి.. ఆ తర్వాత బహిర్గతం చేసిన విషయం తెలిసిందే.ఇప్పుడు ఆ జాబితాలోకి ‘ఆది పురుష్’ సినిమాలో సీతగా నటించి, ఆకట్టుకున్న ప్రభాస్ బ్యూటీ కృతి సనన్(Kriti Sanon), కబీర్ బాహియా (Kabir Bahia) జంట వచ్చి చేరింది. గత కొన్ని రోజులుగా ఈ జంట తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టకుండా దాపరికం చేస్తోంది. అసలు తమ మధ్య ఏమీ లేదని.. కానీ ఉంది అని.. అసలు ఏముంది ? అనే విషయం మాత్రం బయటకు చెప్పకుండా దోబూచులాడుతున్నారు.
కబీర్ తో చట్టాపట్టాలేసుకొని తిరుగుతూ..
ఇక కృతి సనన్ , కబీర్ కుటుంబంలో జరిగే ప్రతి సెలబ్రేషన్స్ లో హాజరవుతోంది. అతనితో చాలా చనువుగా ఉంటూ ఫోటోలకు ఫోజులిస్తోంది. మరి మీ మధ్య ఉన్న బంధం ఏమిటి ? అంటే.. మౌనం సమాధానం గా మారిపోయింది. ఇంతలోనే ముంబై మీడియా ఈ జంట పెళ్లికి ఇంకా ఎంతో సమయం పట్టదని, కొత్త పుకార్ని పుట్టించింది. ఈ పుకార్ల మధ్య కృతి సనన్ , కబీర్ బాహియా ఢిల్లీ విమానాశ్రయంలో కనిపించారు. వ్యాపారవేత్త కబీర్ బాహియాతో ఏడాదికాలంగా డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వైరల్ అవుతుండగా.. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా.. కబీర్ కుటుంబ సభ్యుల కోసం కృతిసనన్ చేస్తున్న పనులు మాత్రం వీడి మధ్య ఉన్న బంధాన్ని మరింత బలపరుస్తున్నాయి.
కబీర్ తల్లిదండ్రులను కలిసిన కృతి..
ఇదిలా ఉండగా.. నాడు కృతి సనన్,కబీర్ బాహియా ఢిల్లీ విమానాశ్రయంలో కనిపించారు. కబీర్ తల్లిదండ్రులను కలవడానికి కృతి ఢిల్లీకి వెళ్లిందని తెలుస్తోంది. దీంతో ఈ జంట పెళ్లితో ఒక్కటి అయ్యేందుకే వెళ్లారేమో అంటూ మీడియా కూడా ప్రచారాలు చేస్తున్నారు. ఒక వీడియోలో ఈ జంట విమానాశ్రయం నుండి బయటకు వస్తున్నట్లు కనిపించగా.. అక్కడి నుండి బయటకి వస్తూ కృతి తన ముఖాన్ని నల్లటి ముసుగుతో కప్పేసే ప్రయత్నం చేసింది. దీనికి తోడు గతవారం వీరిద్దరూ కూడా ముంబైలో ఒక విందులో కనిపించారు. ఇక రెస్టారెంట్ నుండి బయటకు వచ్చినప్పుడు కూడా కెమెరా కంట పడ్డారు. కానీ ఇంతలోనే విడివిడిగా వెళ్లేందుకు ప్రయత్నించారు. అంతేకాదు గత ఏడాది క్రిస్మస్ సెలబ్రేషన్స్లో దుబాయ్ లో వీళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. పైగా ఇద్దరూ నైట్ పార్టీలో ఫుల్ గా డాన్సులు వేస్తూ.. అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇక ఇందులో కృతి సనన్ సోదరి నుపూర్ సనన్ కూడా పాల్గొనింది. అంతేకాదు కబీర్ కి దగ్గర బంధువైన ఎం.ఎస్. ధోని(M.S.Dhoni) కూడా వారితో కలిసి డాన్స్ చేశారు. మొత్తానికైతే తమ బంధాన్ని కన్ఫామ్ చేయలేదు. కానీ అతడి కోసం తన తల్లిదండ్రులను కలిసి అందరిని ఆశ్చర్యపరుస్తోంది కృతి. మరి ఇప్పటికైనా తమ బంధాన్ని బయటపెడతారేమో చూడాలి.
ఇకపోతే కరీనా కపూర్ – టబులతో కలిసి ‘క్రూ ‘అనే చిత్రంలో నటించిన ఈమె.. ఈ సినిమాతో కమర్షియల్ సక్సెస్ అందుకుంది.