Champions Trophy PAK vs NZ: క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మరికొద్ది గంటలలోనే ప్రారంభం కాబోతోంది. ప్రపంచంలోని అత్యుత్తమ ఎనిమిది జట్లు ఈ టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. రేపు కరాచీలో జరిగే మ్యాచ్ లో డిపెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్ – న్యూజిలాండ్ తో తలపడడంతో ఈ టోర్నీ ప్రారంభం అవుతుంది. అయితే ఈసారి పాకిస్తాన్ జట్టు ఫామ్ లో లేకపోవడంతో వారి సెమీఫైనల్ అవకాశాలపై అనుమానాలు నెలకొన్నాయి.
Also Read: Akhil Akkineni – RCB: బెంగుళూరు కెప్టెన్ గా అక్కినేని అఖిల్..షాక్ లో రజత్?
స్వదేశంలో జరిగిన ట్రై – సిరీస్ ఫైనల్ లో ఓటమి చెందిన పాకిస్తాన్ జట్టు.. ఆటగాళ్ల ప్రదర్శనలో నిలకడ లేకపోవడం వల్ల బలహీనంగా కనిపిస్తోంది. ఇటీవల ముగిసిన ట్రై సిరీస్ లో పాకిస్తాన్ జట్టు.. దక్షిణాఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో 352 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదించి సొంత గడ్డపై రికార్డు క్రియేట్ చేసింది. అనంతరం ఒక్కరోజు గ్యాప్ లోనే న్యూజిలాండ్ చేతిలో ఘోరపరాజయం పాలైంది. ఇలా పాకిస్తాన్ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
ఇక ట్రై సిరీస్ లో గెలిచిన ఊపులోనే.. ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో కూడా గెలుపొందాలని పట్టుదలతో ఉంది న్యూజిలాండ్ జట్టు. ఈ క్రమంలో రేపు {ఫిబ్రవరి 19} తేదీన పాకిస్తాన్ – న్యూజిలాండ్ జట్ల మధ్య పోటీతో ఈ టోర్నీ ప్రారంభం కాబోతోంది. ఇక చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లను ఈసారి భారత్ లో జియో, హాట్ స్టార్ నెట్వర్క్ ప్రసారం చేయనున్నాయి. ఇందులో భాగంగానే టీవీలో స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18 చానల్స్ లో ప్రసారం కానున్నాయి.
తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, బెంగాలీ, భోజ్పురి, తమిళ్, కన్నడ వంటి ఎనిమిది భాషలలో ఈ మ్యాచ్లు ప్రసారం కానున్నాయి. ఇక డిజిటల్ స్ట్రీమింగ్ విషయానికి వస్తే జియో హాట్ స్టార్ లో వీక్షించవచ్చు. గతంలో జియో టీవీలో ఉచితంగా మ్యాచ్ లను వీక్షించే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం జియో, హాట్ స్టార్ రెండు కలిసి జియో స్టార్ గా మారిన నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read: Indian Team Matches: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా మ్యాచ్ ల టైమింగ్స్, ఫ్రీగా ఎలా చూడాలి ?
ఇక టీవీలో మాత్రం మ్యాచ్ లను ఉచితంగా వీక్షించవచ్చు. ఇక రేపు పాకిస్తాన్ – న్యూజిలాండ్ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ లో ప్లేయింగ్ లెవెల్ అంచనా.. న్యూజిలాండ్: విల్ యంగ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (WK), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (c), జాకబ్ డఫీ, నాథన్ స్మిత్, విలియం ఓ’రూర్క్. పాకిస్థాన్: ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (c & wk), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్.