Prabhas : తెలుగు స్టార్ హీరో, పాన్ ఇండియా స్టార్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోలలో ప్రభాస్ రేంజే వేరు.. ఈయన సినిమాలతో పాటుగా సినిమాకలకు భారీగా డిమాండ్ చేస్తారు అందుకే ఆయన రెమ్యూనరేషన్ కూడా ఎక్కువే. తెలుగు లో మాత్రమే కాదు.. వేరే భాషల్లో కూడా ఆయనకు మంచి డిమాండ్ ఉంది. అలాంటి ప్రభాస్ గురించి ఓ స్టార్ హీరో సంచలన విషయాలను బయట పెట్టాడు.. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ప్రభాస్ గురించి ఇలాంటి విషయాలను విని డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటుగా సినీ అభిమానులు ఔరా అంటున్నారు.. అలా చెయ్యడం కేవలం ప్రభాస్ కే సాధ్యం అని ఫ్యాన్స్ అంటున్నారు.
డార్లింగ్ ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉంటాడు. తన పనేదో తాను చూసుకుంటూ, మీడియా దృష్టికి దూరంగా ఉంటాడు.. ప్రభాస్ భోజనం ప్రియుడు.. తనతో సినిమా చేసే వాళ్ళందరికీ అద్భుతమైన భోజనాన్ని అందిస్తాడు ఇక హీరోయిన్ల కైతే ఆతిథ్యమే వేరని చెప్పాలి.. గతంలో ఎన్నడూ ఎప్పుడూ చూడని విధంగా హీరోయిన్లకు భోజనాన్ని అందిస్తారు. విషయం ఏంటంటే తన చేతులతో స్వయంగా వండిన వంటను హీరోయిన్లకు రుచి చూపిస్తారు. ప్రభాస్ అంటే అందుకే అందరు ఇష్టపడతారు.. ఇక వేరే ఇండస్ట్రీ హీరోయిన్లు సైతం ఆయన భోజనానికి ఫిదా అవుతారు.. ఇటీవల ఫౌజి హీరోయిన్ ఇమాన్వి ఆయన భోజనానికి ఫిదా అయ్యింది. ఆమె షేర్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇలా గతంలో చాలా మంది ప్రభాస్ మంచితనాన్ని పొగిడేశారు.
ఇదిలా ఉండగా.. సలార్ మూవీలో డార్లింగ్ తో పాటుగా నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్న మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజన్ సుకుమారన్ తాజాగా ప్రభాస్ గురించి ఎన్నో కీలక విషయాలను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. ప్రభాస్ గురించి ఎవరికీ తెలియని కొన్ని సీక్రెట్ ను రీవిల్ చేశాడు.. ఆయన ప్రభాస్ పెద్ద స్టార్ అయినప్పటికీ నిరాడంబరంగా ఉంటాడు. ఆయన సోషల్ మీడియా వాడడు. అసలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్స్ కూడా ప్రభాస్ పెట్టరు. ఆయన పేరిట మరొకరు పెడతారు. ఈ మాట చెప్పి బాధ పెడుతున్నందుకు క్షమించండి. ప్రభాస్ ఎప్పుడూ ప్రశాంతంగా ఫార్మ్ హౌస్లో ఉండాలి అనుకుంటారు. అసలు మొబైల్ లేని ప్రదేశానికి వెళ్లి హాయిగా గడపాలి అని భావిస్తారు. ప్రభాస్ చిన్న చిన్న ఆనందాలు చూస్తే ఆశ్చర్యం, వేస్తుంది అన్నారు. ప్రభాస్ ఇంస్టాగ్రామ్ ని 13 మిలియన్స్ కి పైగా ఫాలో అవుతారు. ఇలా ప్రభాస్ సీక్రెట్స్ ను ఒక్కొక్కటిగా బయట పెట్టాడు. ఇక ప్రభాస్ సినిమాలు విషయానికొస్తే.. రాజా సాబ్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ తర్వాత పౌజి సినిమాలో నటించిన ఉన్నాడు. ఈ సినిమాల తర్వాత సలార్ 2 కల్కి 2 సినిమాలలో నటించనున్నాడు..