BigTV English

Kalki 2898 AD Trailer: కల్కి ట్రైలర్ వచ్చేసింది.. ఫ్యాన్స్ కు పూనకాలే!

Kalki 2898 AD Trailer: కల్కి ట్రైలర్ వచ్చేసింది.. ఫ్యాన్స్ కు పూనకాలే!

Prabhas Kalki 2898 AD Trailer: ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూసిన కల్కి2898AD ట్రైలర్ వచ్చేసింది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలో నటిస్తున్నారు.


మొట్ట మొదటి సార్ ప్రభాస్ కు విలన్ గా కమల్ హాసన్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, బుజ్జి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎన్నో వాయిదాల తరువాత జూన్ 27 న కల్కి ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ నేడు కల్కి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కోసం అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

మునుపెన్నడూ చూడని ప్రభాస్ ను ఇందులో చూపించారు. భైరవ – బుజ్జిల మధ్య వచ్చే సన్నివేశాలు నెక్ట్స్ లెవెల్. ముఖ్యంగా ప్రభాస్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో.. అందుకు ఎగ్జాట్ గా నాగీ చూపించాడు. ఇక అశ్వద్ధామగా అమితాబ్ యాక్షన్ అదరగొట్టేసాడు. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఇక ఈ ట్రైలర్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.


Related News

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

Big Stories

×