E-Paper
Advertisement

Pakistan Super Eight Qualification Chances: టీ 20 ప్రపంచ కప్ నుంచి పాకిస్తాన్ అవుట్?

Pakistan Super Eight Qualification Chances: టీ 20 ప్రపంచ కప్ నుంచి పాకిస్తాన్ అవుట్?
Advertisement

Pakistan Super Eight Qualification Chances: టీ 20 ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ బయటకు వచ్చీసినట్టేనా? అంటే అవుననే అందరూ అంటున్నారు. ఎందుకంటే గ్రూప్ ఏ…లో ఐదు జట్లు ఉన్నాయి. ప్రతీ జట్టు మిగిలిన నాలుగు టీమ్ లతో ఆడాల్సి ఉంటుంది. ఆల్రడీ పాకిస్తాన్ రెండు జట్లు యూఎస్ఏ, ఇండియాతో ఆడింది. రెండింటా ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో ఇంకా ఐర్లాండ్, కెనడా దేశాలతో ఆడాల్సి ఉంది. ఒకవేళ వాటిపై గెలిచినా 4 పాయింట్లు వస్తాయి.

ఆల్రడీ యూఎస్ఏ, ఇండియాకి నాలుగు పాయింట్లు ఉన్నాయి. వీరు మరొక్క మ్యాచ్ గెలిస్తే చాలు…ఈ రెండు జట్లు సూపర్ 8కి చేరతాయి. లేదంటే ఇండియా చేతిలో యూఎస్ఏ ఓటమి పాలు కావాలి. అంతేకాదు తను తర్వాత ఆడాల్సిన ఐర్లాండ్ చేతిలో కూడా ఓడాల్సి ఉంటుంది. అలా 4 పాయింట్లపైనే ఉంటే, నెట్ రన్ రేట్ ఆధారంగా పాక్-యూఎస్ఏ రెండింటిలో ఏది ముందు వరుసలో ఉంటే, అది సూపర్ 8కి వెళుతుంది.
ప్రస్తుతం పాక్ చేరాలంటే అద్భుతమే జరగాలి. ఒకసారి సూపర్ 8 అవకాశాలు ఎలా ఉన్నాయో చూద్దాం

Advertisement

టీమ్ఇండియా: టీమ్ఇండియా వ‌రుస‌గా ఐర్లాండ్‌, పాకిస్తాన్‌ల‌పై విజ‌యాలు సాధించింది. 4 పాయింట్లతో పాటు మెరుగైన ర‌న్‌రేటు(1.455)తో గ్రూప్ ఏలో అగ్ర‌స్థానంలో ఉంది. జూన్ 12న అమెరికా, జూన్ 15న కెన‌డాతో టీమ్ఇండియా ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచుల్లో ఒక్కటి గెలిచినా భార‌త్ సూప‌ర్ 8లోకి అడుగుపెట్ట‌నుంది.

అమెరికా: అతిథ్య జట్టు అమెరికా పెద్ద జట్లకు సవాల్ విసురుతోంది. ఆడిన రెండు మ్యాచుల్లో గెలిచింది. ముఖ్యంగా పాకిస్తాన్ పై విజ‌యం సాధించ‌డంతో సూప‌ర్ 8కి చేరువైంది. ప్ర‌స్తుతం అమెరికా ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. ప‌ట్టిక‌లో రెండో స్థానంలో ఉంది. త‌న త‌దుప‌రి రెండు మ్యాచులు భార‌త్‌, ఐర్లాండ్ తో ఆడ‌నుంది. ఈ రెండింటిలో ఒక్కటి గెలిచినా అమెరికా సూప‌ర్‌8కి అర్హ‌త సాధిస్తుంది. అప్పుడు పాకిస్తాన్ ఇంటి ముఖం ప‌ట్టాల్సిందే.

Advertisement

Also Read: గ్రౌండ్ లో ఏడ్చిన పాక్ ఆటగాడు.. ఓదార్చిన రోహిత్ శర్మ

పాకిస్తాన్, ఐర్లాండ్: రెండు జట్లకు ఆడాల్సిన మ్యాచ్ లు ఉన్నా, వారికి గరిష్టంగా 4 పాయింట్లు మాత్రమే వస్తాయి. కానీ కెనడాకు మాత్రం ఒక అవకాశం ఉంది. ఆల్రడీ ఆ జట్టు ఐర్లాండ్ పై గెలిచింది. ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాలి. వాటిని గానీ నెట్ రన్ రేట్ తో ఆడి గెలిస్తే, పెద్ద జట్లకు ఇక్కట్లు తప్పవు.

ఇదీ సంగతి.. ఎటు నుంచి ఎటు చూసినా కనీసం కెనడాకైనా ఉన్నాయి కానీ.. పాకిస్తాన్ కి కనిపించడం లేదు. మొత్తానికి యూఎస్ఏతో ఓటమి.. ఇంతటి పరిస్థితిని తీసుకువచ్చింది.

Related News

తమిళనాడులో పార్టీ పెడితే, వచ్చే ఎన్నికల్లో ధోని సీఎం కావడం పక్కా?

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

Big Stories

Advertisement
×